Central Government Employees
Central government Employees : దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం భారీ గిఫ్ట్ అందించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత-సంబంధిత బోనస్‌ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తపాలా శాఖ ఉద్యోగులు 60 రోజుల జీతానికి (Central government Employees) సమానమైన బోనస్‌ను అందుకుంటారని ఉత్తర్వులో పేర్కొంది. ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ డబుల్ బోనస్ ప్రకటించింది. ఇంతకీ ఏయే ఉద్యోగులకు ఈ బోనస్ అందనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ బోనస్ ఎవరికి లభిస్తుంది? :
రెగ్యులర్ ఉద్యోగులు : గ్రూప్-C, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), నాన్-గెజిటెడ్ గ్రూప్ B ఉద్యోగులు.
గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) క్రమం తప్పకుండా పనిచేసే వారు అర్హులు
టెంపరరీ, ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంప్లాయిస్ :
మార్చి 31, 2025 తర్వాత రిటైర్మెంట్, రిజైన్ చేసిన లేదా డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్‌కు అర్హులు. సంబంధిత నిబంధనల ప్రకారం ఇలాంటి ఉద్యోగులందరికీ ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) చెల్లించడం జరుగుతుందని ఉత్తర్వులో పేర్కొంది.
బోనస్ ఎలా లెక్కిస్తారంటే? :
బోనస్ గణన కోసం ఈ ఫార్మూలాను పోస్టల్ శాఖ వివరించింది.
రెగ్యులర్ ఎంప్లాయిస్ :
బోనస్ = (సగటు జీతం × 60 రోజులు ÷ 30.4)
బోనస్ లెక్కింపుకు గరిష్ట జీతం నెలకు రూ.7వేలు పరిమితం
గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) కోసం :
ఈ బోనస్ అనేది (TRCA), కరవు భత్యం (DA) ఆధారంగా నిర్ణయిస్తారు.
టెంపరరీ లేదా ఫుల్ టైమ్ ఉద్యోగులకు :
నెలకు రూ. 1,200 అంచనా జీతం ఆధారంగా తాత్కాలిక బోనస్ లభిస్తుంది.