PM Kisan 21st Installment Date : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ వాయిదా డేట్ ఇదిగో.. రూ. 2వేలు పడాలంటే రైతులు ఇలా చేయాల్సిందే..!

PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ 21వ వాయిదా విడుదలపై కొత్త అప్‌డేట్ వచ్చింది. రూ. 2వేలు ఎప్పుడు విడుదల అవుతాయంటే?

PM Kisan 21st Installment Date : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ వాయిదా డేట్ ఇదిగో.. రూ. 2వేలు పడాలంటే రైతులు ఇలా చేయాల్సిందే..!

PM Kisan 21st Installment Date

Updated On : October 19, 2025 / 5:16 PM IST

PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. అతి త్వరలోనే పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. ఈ నెలలో పీఎం కిసాన్ 21వ విడత రూ. 2వేలు డబ్బుల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎం నరేంద్ర మోదీ గత ఆగస్టులో 20వ విడతను విడుదల చేశారు. 2.4 కోట్ల మంది మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. గత జూన్‌లో అంచనాలకు భిన్నంగా ఈ విడత ఆలస్యం అయింది.

సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదా (PM Kisan 21st Installment Date) విడుదల అవుతుంది. గత ఫిబ్రవరిలో 19వ విడత, అక్టోబర్ 2024లో 18వ విడత, జూన్ 2024లో 17వ విడత విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా డీబీటీ ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6వేలు అందిస్తుంది. ఇప్పటివరకు, ప్రభుత్వం 20 వాయిదాలను విడుదల చేసింది.

పీఎం కిసాన్ పథకం ఏంటి? :
పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున అందిస్తారు. ఈ డబ్బును ప్రతి ఏడాదిలో 3 విడతలుగా (ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి) అందిస్తారు. ఈ ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు బదిలీ అవుతుంది.

ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆ తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకంగా మారింది.

పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ పథకం 21వ విడత దీపావళికి ముందు విడుదల అవుతుందని అంచనా. అయితే, అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. రైతులకు నవంబర్‌లో 21వ విడత రూ. 2వేలు అందే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని వరదలు, కొండచరియల బాధిత రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ పథకం 21వ విడతను విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని కృషి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముందస్తుగా వాయిదాను విడుదల చేశారు.

ఈ విడుదల కింద జమ్మూ కాశ్మీర్‌లోని 85వేల మంది మహిళా రైతులు సహా 8.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.171 కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతంలోని రైతులు ఇప్పటివరకు పీఎం కిసాన్ కింద మొత్తం రూ.4,052 కోట్లు అందుకున్నారు. ఇంతలో, రైతులు అర్హతను చెక్ చేయడం, కేవైసీని పూర్తి చేయడం, లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయడం చాలా అవసరం. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే కూడా వెంటనే అప్లయ్ చేసుకోవాలి.

పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? :

  • పీఎం కిసాన్ 21వ విడత అర్హతలివే..
  • భారతీయ పౌరుడు
  • సాగు భూమి
  • చిన్న లేదా సన్నకారు రైతు
  • నెలకు కనీసం రూ. 10వేల పెన్షన్, రిటైర్మెంట్ పర్సన్ కాకూడదు.
  • ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు.
  • సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.

పీఎం కిసాన్ పథకం ఈ-కెవైసీ ఎలా? :
పీఎం కిసాన్ వాయిదాల కోసం రైతులు తమ ఇ-కేవైసీని పూర్తి చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ అయిన రైతులకు eKYC తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఇకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC సెంటర్లను సంప్రదించవచ్చు.

పీఎం కిసాన్ లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • అధికారిక వెబ్‌సైట్‌ (https://pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
  • ఇప్పుడు, పేజీ రైట్ సైడ్ ‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్‌, కాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి.
  • ఆపై ‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ లబ్ధిదారుడి స్టేటస్ స్ర్కీన్‌పై కనిపిస్తుంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేసుకోండి :

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) విజిట్ చేయండి.
  • ‘Beneficiary List’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • డ్రాప్-డౌన్ నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంచుకోండి.
  • ‘Get Report’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తరువాత లబ్ధిదారుల జాబితా డిస్‌ప్లే అవుతుంది.
  • మీరు హెల్ప్‌లైన్ (155261, 011-24300606) నంబర్లకు కాల్ చేయవచ్చు

పీఎం కిసాన్ యోజన కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి? :

  • అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)ని విజిట్ చేయండి.
  • ‘New Farmer Registration’పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌, క్యాప్చా ఎంటర్ చేయండి.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేసి ‘Yes’పై క్లిక్ చేయండి.
  • పీఎం కిసాన్ అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని ఇవ్వండి.
  • ఆపై సేవ్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.