ఇండియాకు జెఫ్ బెజోస్ : అమెజాన్‌కు వ్యతిరేకంగా మిలియన్ల రిటైలర్లు నిరసనకు ప్లాన్!

  • Publish Date - January 13, 2020 / 06:07 AM IST

ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం amazon తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ బిజినెస్ డెవలప్ చేసేందుకు ప్రధాన నగరాల్లో తమ బ్రాంచులను కూడా విస్తరిస్తోంది. amazon ప్రాబల్యంతో దేశంలోని చిన్న తరహా వ్యాపారులు తమ వ్యాపారపరంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఎదురువుతోంది. ఈ క్రమంలో అమెజాన్.కామ్ ఇంక్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ త్వరలో భారత్ కు రానున్నారు.

బెజోస్ కు వ్యతిరేకంగా ఇండియాలోని 70 మిలియన్ల మంది చిన్న తరహా ట్రేడర్లంతా నిరసన తెలియేజేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆధ్వర్యంలోని గ్రూపు దాదాపు 70 మిలియన్ల మంది రిటైలర్లతో కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో బెజోస్ పర్యటన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా 300 నగరాల్లో రిటైలర్లంతా నిరసన తెలియజేయనున్నారు.

ఢిల్లీ, ముంబై, కోల్ కతా సహా అన్ని ప్రధాన నగరాలతో పాటు చిన్న టౌన్లు, నగరాల్లో జెఫ్ బెజోస్‌కు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీను నిర్వహించనున్నట్టు CAIT గ్రూపు సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండెల్ వాల్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కనీసం లక్ష మంది ట్రేడర్లు పాల్గొంటారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఈ వారమే దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న కంపెనీ ఈమెంట్‌లో ప్రభుత్వ అధికారులతో కలిసి amazon సీఈఓ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో అమెజాన్ కార్యకలాపాలకు సంబంధించి చర్చించనున్నట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రభుత్వ అధికారులతో జెఫ్ సమావేశం, చర్చలు జరిపే అవకాశం ఉంది. బెజోస్ ఎప్పుడు ఏ తేదీన భారత్ వస్తున్నారు? ఆయన ఎక్కడ బస చేస్తారు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు జెఫ్ బెజోస్ భారత్ పర్యటనపై అమెజాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. దీనిపై ప్రధాని కార్యాలయం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు..

దేశంలో ఆన్‌లైన్ రిటైలర్స్ అమెజాన్, వాల్ మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్ కార్ట్ ప్రాబల్యం కారణంగా 2015 నుంచి CAIT నేతృత్వంలోని రిటైలర్లు వ్యాపారపరంగా ఉనికిని కోల్పోతున్నారు. అప్పటినుంచి ఈ కామర్స్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ కామర్స్ పేరుతో భారీ డిస్కౌంట్లు, భారతీయ విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించిస్తోందని ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలను ఈ కామర్స్ దిగ్గజాలు కూడా తీవ్రంగా ఖండించాయి. గతంలోనే amazon తమ ప్లాట్ ఫాం ద్వారా వేలాది మంది చిన్న వర్తకులు, పారిశ్రామికులు, చేనేతలు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం వ్యాపార అవకాశాలను అందిస్తున్నట్టు వెల్లడించింది. కానీ, ఈ విషయంలో CAIT మాత్రం అసమ్మతిని తెలియజేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు