జెట్ ఎయిర్ వేస్‌కు కష్టాలు మీద వచ్చి పడుతున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థ విమానాలను రద్దు చేసుకొంటోంది. మరో రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇలా ప్లయిట్స్‌లను క్యాన్సిల్ అయినవి మొత్తం 23. పన్నుల ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
Also Read : భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు
లీజుదారులకు చెల్లింపులు, అద్దెలు కట్టలేకపోతోంది. ఇక సిబ్బంది జీతాల విషయం సరేసరి. వారికి వేతనాలు కూడా చెల్లించడం లేదు. దీనికారణంగా విమానాల సర్వీసులను సంస్థ నిలిపివేస్తోంది. కొన్ని కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల సంస్థను మళ్లీ గాడిలో పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది జెట్ ఎయిర్ వేస్.
ఫిబ్రవరి 7వ తేదీనే విమానాలను నిలిపివేసారు. అదే నెల మరో రెండు విమనాలను 23వ తేదీ ఆపివేసారు. ఫిబ్రవరి 27,28 తేదీల్లో జెట్ ఎయిర్‌వేస్ మొత్తం 13 విమానాలను నిలిపివేసింది. మార్చి నెలలో కూడా విమానాలు నిలిచిపోయాయి. మొత్తం నిలిచిపోయిన విమానాల సంఖ్య 23కి పెరిగింది.
Also Read : అందరికీ తెలిసిందేగా : నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని కానన్న ఇమ్రాన్
జెట్ ఎయిర్ వేస్‌కి మాత్రం త్వరలోనే కష్టాలు వీడనున్నాయని యాజమాన్యం భావిస్తోంది. పలు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. జెట్ ఎయిర్ వేస్‌ని గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందని ఈ సంస్థకు రుణదాతగా ఉన్న SBH, ఇతర బ్యాంకులు ఇటీవలే వెల్లడించాయి. మరి కష్టాలు తొలుగుతాయా ? లేదా ? అనేది వెయిట్ అండ్ సీ.
Also Read : లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు