Jio vs Airtel : జియోకు షాకిచ్చిన యూజర్లు.. ఎయిర్‌టెల్‌కు కొత్త యూజర్లు!

రిలయన్స్ జియోకు షాకిచ్చారు యూజర్లు. 2021 ఏడాది సెప్టెంబర్ నెలలో జియో వైర్ లెస్ యూజర్లను భారీగా కోల్పోయింది. దాదాపు 1.9 కోట్ల వైర్ లెస్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది.

Reliance Jio vs Airtel : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియోకు షాకిచ్చారు యూజర్లు. 2021 ఏడాది సెప్టెంబర్ నెలలో జియో వైర్ లెస్ యూజర్లను భారీగా కోల్పోయింది. దాదాపు 1.9 కోట్ల వైర్ లెస్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయినట్టు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా వెల్లడించింది. ట్రాయ్ డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో కోట్లాది మంది సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది. కానీ, మరో టెలికం దిగ్గజం, జియో పోటీదారైన భారతీ ఎయిర్ టెల్ మాత్రం భారీగా కొత్త యూజర్లను సొంతం చేసుకుంది.
Read Also : Airtel Prepaid Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ప్రీ‌పెయిడ్ ఛార్జీల పెంపు..!

అదే నెలలో ఎయిర్ టెల్ 2.74 లక్షల మంది కొత్త యూజర్లను దక్కించుకుంది. అలాగే వొడాఫోన్ ఐడియా (Vi) కూడా సెప్టెంబర్‌ నెలలో 10.7 లక్షల మందిని కోల్పోయింది. 11 నెలలుగా వోడాఫోన్‌ ఐడియా నుంచి యూజర్లు వెళ్లిపోతున్నారు. సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ (Airtel) 0.08 శాతం కొత్త యూజర్‌బేస్‌ సొంతం చేసుకుంది.

రిలయన్స్ జియో మాత్రం 4.29శాతం మేర యూజర్ బేస్ క్షీణించింది. వైర్‌లెస్‌ సబ్‌స్రైబర్స్‌ మార్కెట్‌లో ఆగస్టులో 1.18 బిలియన్ల నుంచి సెప్టెంబర్ చివరి నాటికి 1.16 బిలియన్లకు సబ్ స్ర్కైబర్లు పడిపోయారు. భారతీ ఎయిర్‌టెల్ మొబైల్‌ ప్లాన్ టారిఫ్ ధరలను కనీసం 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్‌ టారిఫ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో తమ కస్టమర్లు వేరే నెట్‌వర్క్‌కు మారే అవకాశం లేకపోలేదు.

Read Also : TikTok Ban : నాల్గోసారి.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తేసిన పాక్!

ట్రెండింగ్ వార్తలు