TikTok Ban : నాల్గోసారి.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తేసిన పాక్!

ప్ర‌ముఖ చైనా వీడియో షేరింగ్ సర్వీసు, షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ పై మళ్లీ నిషేధం ఎత్తేసింది పాకిస్తాన్. 15 నెలల వ్యవధిలో పాక్ టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తేయడం నాల్గోసారి.

TikTok Ban : నాల్గోసారి.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తేసిన పాక్!

Tiktok Ban Lift Pakistan

TikTok Ban Lift Pakistan : ప్ర‌ముఖ చైనా వీడియో షేరింగ్ సర్వీసు, షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ (TikTok)పై మళ్లీ నిషేధం ఎత్తేసింది పాకిస్తాన్. 15 నెలల వ్యవధిలో పాక్ టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తేయడం ఇది నాల్గోసారి. గ‌త శుక్ర‌వార‌మే టిక్‌టాక్‌పై బ్యాన్‌ను ఎత్తేసిన‌ట్టు పాకిస్థాన్ మీడియా రెగ్యులేటింగ్ అథారిటీ వెల్లడించింది.

అక్టోబ‌ర్ 2020న మొద‌టిసారి పాకిస్థాన్‌లో టిక్‌టాక్ బ్యాన్ చేసింది. టిక్‌టాక్ యాప్‌లో అస‌భ్య‌క‌ర వీడియోలు వస్తున్నాయనే ఆరోప‌ణ‌ల‌తో పాక్ మొదటిసారి బ్యాన్ చేసింది. అలాంటి అస‌భ్య‌క‌ర కంటెంట్‌ను వెంటనే నిషేధిస్తామని చైనా టిక్‌టాక్ పేరంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌ (ByteDance) పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి హామీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నాలుగోసారి టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లో టిక్‌టాప్ యాప్‌కు మంచి ఫాలోయింగ్ అయింది. పాక్‌లో 39 మిలియ‌న్ల మంది టిక్ టాక్ యాప్ డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. పాకిస్థాన్‌, చైనాకు స‌త్సంబంధాల దృష్ట్యా ఆ యాప్‌పై బ్యాన్‌ను పాక్ ఎత్తేసింది.

2008లోనే యూట్యూబ్‌ను పాక్ బ్యాన్ చేసింది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్‌పై కూడా పాక్ ఆరోప‌ణ‌లు చేసింది. పాక్ చట్టానికి వ్య‌తిరేకంగా ఇస్లామ్ మ‌తంపై అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్‌ను ఆయా సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌లో ప్ర‌మోట్ చేస్తున్నారంటూ ఆరోపించింది.

Read Also : iPhone USB Type-C : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు!