iPhone USB Type-C : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు!

ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ కొత్త ఐఫోన్ (iPhone 14 Series) వస్తోంది. అంతేకాదండోయ్.. ఐఫోన్లలో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ తిరిగి తీసుకొస్తోంది.

iPhone USB Type-C : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు!

You May Be Able To Charge Apple Iphone 14 With An Android Phone Charger

iPhone 14 Pro USB Type-C : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ కొత్త ఐఫోన్ (iPhone 14 Series) వస్తోంది. అంతేకాదండోయ్.. ఐఫోన్లలో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ తిరిగి తీసుకొస్తోంది. అంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్లతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.. ఇప్పటికే ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ (iPhone 13 series)ను ప్రారంభించింది. ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 series) కూడా వచ్చేస్తోందంటూ రుమర్లు వినిపిస్తున్నాయి. రాబోయే iPhone 14 Pro సిరీస్ ఫీచర్లు లీకయ్యాయి. ఈ మోడల్ ఫోన్ USB Type-C పోర్టుతో రానుందట.. అంటే.. ఐఫోన్ 14pro యూజర్లు తమ ఫోన్ ఆండ్రాయిడ్ ఛార్జర్ (Android Charger) ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఐఫోన్‌లు లైటింగ్ పోర్ట్‌తో వస్తున్నాయి. వీటిలో Type-C ఛార్జర్లతో ఛార్జ్ చేయడం కుదరదు.

ఐడ్రాప్ న్యూస్ (iDrop News) నివేదిక ప్రకారం.. అప్ కమింగ్ ఐఫోన్‌లలో USB Tpe-C పోర్ట్ ఉండవచ్చు. ఆపిల్ లైటింగ్ పోర్ట్‌ను డిచ్ చేయవచ్చు. టాప్-ఎండ్ ఐఫోన్ 14 ప్రో (iPhone 14pro), 14Pro Max మోడల్ ఐఫోన్లలో మాత్రమే ఉండొచ్చునని నివేదిక తెలిపింది. అదేగానీ జరిగితే.. ఆపిల్ హై-ఎండ్ ఐఫోన్ మోడల్స్ అనేక మార్పులతో మార్కెట్లోకి రానున్నాయి. ఆపిల్ రిలీజ్ చేయబోయే రాబోయే జనరేషన్ అన్ని ఐఫోన్లలోనూ ఈ USB Type-Cని అందరికీ ప్రామాణికంగా తీసుకురావచ్చు. ప్రతి Apple డివైజ్‌లో ఈ చార్జింగ్ పోర్ట్ ప్రామాణికంగా మారే అవకాశం లేకపోలేదు. రాబోయే iOS iPadOS డివైజ్ యూజర్లందరూ కూడా తమ డివైజ్‌లకు Android ఛార్జర్‌ను ఉపయోగించవచ్చు. Apple iPhone యూజర్లు USB Type-Cకి మారేందుకు ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు.

You May Be Able To Charge Apple Iphone 14 With An Android Phone Charger (1)

యూజర్ల దృష్ట్యా ఆపిల్.. ఈ USB టైప్-C ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రస్తుత లైట్నింగ్ పోర్ట్ (USB 2.0), 720GB ProRES ఫైల్‌ను ట్రాన్స్ ఫర్ చేయడానికి 3 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. అదే.. USB టైప్-C (USB 4.0) కేవలం 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుందని iDrop న్యూస్ పేర్కొంది. అంటే.. ఛార్జింగ్ సమయాన్ని స్వల్పంగా తగ్గిస్తుంది. సమయం వృథా కాదనమాట.. ఆపిల్ ఇటీవల రిలీజ్ చేసిన లేటెస్ట్ M1pro, M1 మ్యాక్స్ పవర్డ్ MacBook Pro 14, 16 మోడళ్లను మల్టీ పోర్ట్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. పాత పోర్ట్‌లో SD కార్డ్ రీడర్ కూడా ఉంది. ఆపిల్ కొత్త ఐఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను 25Wకి విస్తరించింది.

iPhone 14 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? :
గతంలో ఐఫోన్ సిరీస్ లాంచ్ ఈవెంట్‌లను పరిశీలిస్తే.. ఆపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తుంది. నెల రెండవ భాగంలో సేల్ మొదలుపెడుతుంది. ఉదాహరణకు, Apple సెప్టెంబర్ 14న iPhone 13 సిరీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లలో సేల్ ప్రారంభిస్తుంది. Apple వచ్చే ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు. 2022 సెప్టెంబర్‌లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. iPhone సిరీస్‌కి సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also : WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!