Kia Cars : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కియా కార్ల ధరలు.. అతి చౌకైన ధరకే కొనేసుకోండి.. ఏయే కార్లపై తగ్గింపు ఎంతంటే?

Kia Cars : జీఎస్టీ తగ్గింపు తర్వాత కియా ఇండియా అన్ని కారు మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Kia Cars

Kia Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కియా ఇండియా కస్టమర్లు భారీ తగ్గింపు ధరకే కొత్త కారు కొనేసుకోవచ్చు. కేంద ప్రభుత్వం (Kia Cars) ఇటీవలే జీఎస్టీ తగ్గింపుపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కంపెనీ మొత్తం లైనప్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు కియా సెల్టోస్, కియా సోనెట్, కియా కారెన్స్ వంటి పాపులర్ కార్లను గతంలో కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ తగ్గింపు ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే కాకుండా అన్ని వాహనాలకు వర్తిస్తుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంత సేవ్ చేయొచ్చంటే? :
కంపెనీ ఇప్పటికే అనేక కొత్త మోడల్ కార్ల ధరలను తగ్గించింది. కొత్త జీఎస్టీ రేటు అమలు తర్వాత కస్టమర్లకు అనేక కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. కారెన్స్‌పై అత్యల్పంగా రూ.48,513 తగ్గింపు, కార్నివాల్‌పై అత్యధికంగా రూ.4,48,542 తగ్గింపు అందిస్తోంది. చిన్న ఇంజిన్‌ వాహనాలపై డిస్కౌంట్ తక్కువగా ఉండగా, భారీ ఇంజిన్‌లు కలిగిన కార్లు ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. క్రేజీ డీల్స్ మీకోసమే..

ఉదాహరణకు.. సోనెట్ రూ.1,64,471 తగ్గింపు, సెరోస్ రూ.1,86,003, సెల్టోస్ రూ.75,372, కారెన్స్ రూ.48,513, కారెన్స్ క్లావిస్ రూ.78,674, కార్నివాల్ రూ.4,48,542 ధరకు లభిస్తాయి. కారు పెద్దదిగా అయితే డిస్కౌంట్ కూడా అంతే మొత్తంలో పొందవచ్చు. అదే చిన్న ఇంజిన్‌ కార్లపై తక్కువ ధరతో బెనిఫిట్స్ కూడా కొద్దిగా ఉండొచ్చు.

ఆటో రంగానికి బిగ్ రిలీఫ్ :
జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు, ఎస్ యూవీలపై పన్ను రేట్లు తగ్గించింది. గతంలో, చిన్న, మధ్య తరహా వాహనాలపై జీఎస్టీ 28శాతం వరకు ఉండగా, ఇప్పుడు 18శాతానికి తగ్గించారు. అదే సమయంలో, భారీ, లగ్జరీ ఎస్‌యూవీలపై పన్ను భారం కూడా తగ్గిస్తుంది. ఈ నిర్ణయంతో మొత్తం ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపునిచ్చింది. కార్ల అమ్మకాలలో కూడా భారీ పెరుగుదల ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.

పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరగొచ్చు :
పండుగల సమయంలో భారత మార్కెట్లో కొత్త కారు కొనేందుకు ఎక్కువ మంది భావిస్తుంటారు. ఈసారి కియా ఇండియా ధర తగ్గింపుతో కంపెనీ అమ్మకాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ధరల తగ్గింపుతో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరగొచ్చు. దాంతో ఆటో మొబైల్ మార్కెట్లో పోటీ మరింత తీవ్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.