×
Ad

Kia Seltos 2026 : కియా ఫ్యాన్స్ గెట్ రెడీ.. 2026 కొత్త కియా సెల్టోస్ కారు వచ్చేసింది.. టాటా సియెర్రా కన్నా చాలా చీప్..

Kia Seltos 2026 : సరికొత్త కియా సెల్టోస్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. కొత్త సెల్టోస్ టాటా సియెర్రా కన్నా రూ. 50వేలు చౌకగా లభిస్తుంది.

Kia Seltos 2026 (Image Credit To Original Source)

  • కొత్త కియా సెల్టోస్ రూ. 10.99 లక్షల ధరకు లాంచ్.
  • టాటా సియెర్రా ధర కన్నా రూ. 50వేలు తగ్గింపుతో లభిస్తోంది.
  • 2026 జనవరి మధ్యలో ప్రారంభం కానున్న సేల్స్

Kia Seltos 2026 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కియా ఇండియా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. కొత్త సెల్టోస్ 2026 వెర్షన్ వచ్చేసింది. హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం, టాటా సియెర్రా క్రేజ్ మధ్య కియా ఇండియా కొత్త సెల్టోస్‌ను మార్కెట్లో లాంచ్ అయింది. మిడ్ సైజ్ SUV విభాగంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.

ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Kia Seltos 2026) రూ. 10.99 లక్షలుగా ఉంది. కొత్త సెల్టోస్ హ్యుందాయ్ క్రెటా కన్నా రూ. 26 వేలు ఎక్కువ. టాటా సియెర్రా కన్నా రూ. 50 వేలు తక్కువ. కియా నుంచి వచ్చిన ఈ కొత్త SUV మిడ్ సైజ్ విభాగంలో గత మోడళ్లల కన్నా చాలా పెద్దది. భారతీయ ఫ్యామిలీలకు అద్భుతమైన కారు అని చెప్పొచ్చు.

వేరియంట్ల ధరలు, బుకింగ్ డెలివరీ :
కొత్త కియా సెల్టోస్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. HTE, HTK, HTX, GTX వంటి ట్రిమ్‌లతో ధరలు వేర్వేరుగా ఉంటాయి. కొత్త సెల్టోస్ బుకింగ్స్ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. 2026 జనవరి మధ్యలో భారత మార్కెట్లో సేల్స్ ప్రారంభం కానున్నాయి.

ఆకర్షణీయమైన డిజైన్ :
కియా సరికొత్త సెల్టోస్ పాత మోడల్ కన్నా బోల్డ్‌గా ఉంటుంది. పొడవు 4,460 మిమీతో చాలా పొడవు ఉంటుంది. 1830 మిమీ వెడల్పు, 2690మిమీ వీల్‌బేస్ కూడా ఉంది. కియా డిజిటల్ టైగర్ ఫేస్ ఫిలాసఫీ కింద రీడిజైన్ చేశారు.

సెగ్మెంట్-ఫస్ట్ ఆటోమేటిక్ స్ట్రీమ్‌లైన్డ్ డోర్ హ్యాండిల్స్ డైనమిక్ వెల్కమ్ ఫంక్షన్‌తో ఐస్ క్యూబ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ లాంప్స్, 18 అంగుళాల వరకు క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, నియాన్ బ్రేక్ కాలిపర్స్, 10 సింగిల్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

Read Also : Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ జనవరిలో రూ. 20వేల లోపు 6 బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్

అద్భుతమైన ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్ :
2026 కియా సెల్టోస్ ఇంటీరియర్ సరికొత్తగా అందిస్తుంది. 10-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంది. అతిపెద్ద 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఉంది. 8-స్పీకర్ ప్రీమియం బోస్ ఆడియో ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, సెగ్మెంట్-ఫస్ట్ స్మార్ట్ కీ ప్రాక్సిమిటీ అన్‌లాక్ ఫంక్షన్, వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kia Seltos 2026 (Image Credit To Original Source)

సెక్యూరిటీ ఫీచర్లు :
ఈ కియా కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబీడీతో ఏబీఎస్, బ్లైండ్ వ్యూ మానిటర్, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ సైడ్ పార్కింగ్ సెన్సార్లు, 24 సేఫ్టీ ఫీచర్లతో ప్యాకేజీ ఉన్నాయి. లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)లో 21 అటానమస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్లు :
కొత్త కియా సెల్టోస్ కన్వీనియన్స్, ప్రీమియం, అడేస్ ఎక్స్ లైన్ డిజైన్ ప్యాకేజీలతో వస్తుంది. కస్టమర్లు తమకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ SUV 3 ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. స్మార్ట్‌స్ట్రీమ్ 1.5 లీటర్ పెట్రోల్, స్మార్ట్‌స్ట్రీమ్ 1.5 లీటర్ టర్బో జీడీఐ, పెట్రోల్ 1.5 లీటర్ CRDI వీజీటీ డీజిల్ ఇంజన్ ఉండగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ iMT, IVT, 7-స్పీడ్ డీసీటీ 6 స్పీడ్ ఆటోమేటిక్ వంటి అనేక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.