Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ జనవరిలో రూ. 20వేల లోపు 6 బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్

Best 5G Phones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ జనవరిలో రూ. 20వేల లోపు ధరలో 6 బెస్ట్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ జనవరిలో రూ. 20వేల లోపు 6 బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్

Best 5G Phones (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 11:30 AM IST
  • కొత్త ఏడాదిలో 6 అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు మీకోసం
  • ఒప్పో K13 7000mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా
  • సీఎంఎఫ్ 2లో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్‌ ధరలోనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనేసుకోవచ్చు. జనవరి 2026లో 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒప్పో నుంచి వివో వరకు ప్రాసెసర్‌లతో అద్భుతమైన బ్యాటరీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఇలాంటి ఫోన్లను కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి.

ఒప్పో K13 (రూ. 19,999) :
ఈ ఒప్పో K13 ఫోన్ 7000mAh బ్యాటరీతో డ్యూయల్ 50MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (18,999) :
సీఎంఎఫ్ ఫోన్ 2లో 1B కలర్స్, 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌తో నథింగ్ OS 3.2పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP + 50MP + 8MP, రియర్ కెమెరా 5000mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : 7 Best Phones : తగ్గేదేలే.. 2026లో ఐఫోన్ 17 ప్రోకు గట్టి పోటీనిచ్చే 7 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఏది కొంటారంటే?

వివో T4ఎక్స్ (రూ. 18,499) :

వివో T4ఎక్స్ ఫోన్ 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. డ్యూయల్ 50MP కెమెరా మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఫన్‌టచ్ 15పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15పై వర్క్ అవుతుంది.

Best 5G Phones

Best 5G Phones  (Image Credit To Original Source)

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (రూ. 17,999) :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 1B కలర్స్‌తో 6.7-అంగుళాల పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో ఈ యూనిట్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ కూడా పొందవచ్చు. కెమెరాల విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP + 13MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A35 (రూ. 18,999) :
శాంసంగ్ గెలాక్సీ A35 ట్రిపుల్ కెమెరా, 50MP + 8MP + 5MP, 13MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. వన్ యూఐ 7పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (రూ. 18,488) :
ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ, యూనిట్ ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. డ్యూయల్ 50MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేకు సపోర్టు ఇస్తుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh బ్యాటరీని అందిస్తుంది.