Kia Syros SUV
Kia Syros : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా నుంచి సరికొత్త SUV మోడల్ కియా సైరోస్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. మీరు కియా SUV కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్..
మీ బడ్జెట్ రూ.10 లక్షలు అయితే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో కియా సిరోస్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో కియా సిరోస్ కొనుగోలు చేస్తే ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కియా సిరోస్ ధర ఎంతంటే? :
కియా సిరోస్ ధర విషయానికి వస్తే.. కియా సిరోస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.67 లక్షలు. కియా సిరోస్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 18.80 లక్షల వరకు ఉంటుంది. మీరు ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను తీసుకుంటే రిజిస్ట్రేషన్ కోసం సుమారు రూ. 64వేలు, ఇన్సూరెన్స్ కోసం సుమారు రూ. 33వేలు చెల్లించాలి. ఇతర ఛార్జీలతో సహా కియా సిరోస్ కొనేందుకు మొత్తం రూ. 9.72 లక్షల ఆన్-రోడ్ చెల్లించాల్సి ఉంటుంది.
కియా సిరోస్ నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో కియా సిరోస్ కొంటే.. రూ. 7.72 లక్షల బ్యాంక్ లోన్ తీసుకోవాలి. రూ. 7.72 లక్షల రుణాన్ని 5 ఏళ్ల కాలానికి 9శాతం వడ్డీ రేటుతో పొందవచ్చు. అప్పుడు మీరు నెలకు రూ. 16,025 ఈఎంఐగా చెల్లించాలి.
మొత్తం 5 ఏళ్లలో నెలకు రూ. 16,025 ఈఎంఐగా చెల్లించాలి. మీరు బ్యాంకుకు మొత్తం రూ. 9.61 లక్షలు చెల్లించాలి. ఇందులో రూ. 1.89 లక్షల వడ్డీ మాత్రమే ఉంటుంది. కియా సిరోస్ కోసం మీరు ఏకంగా రూ. 1.89 లక్షలు వడ్డీనే చెల్లించాలి.