Union Budget 2026 : మీ ఆదాయం ఇలా ఉంటే జీరో టాక్స్.. సెక్షన్ 87A రిబేట్ రూల్స్ ఏంటి? వీరికి ఎలాంటి పన్ను ఉండదు!

Union Budget 2026 : ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం బడ్జెట్ విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో పన్ను చెల్లింపుదారులకు అందించే టాక్స్ రిబేట్ రాయితీ ఒకటి. వ్యక్తిగత ఆదాయంపై పన్ను రేటును ఎలా జీరో చేయొచ్చంటే?

Union Budget 2026 : మీ ఆదాయం ఇలా ఉంటే జీరో టాక్స్.. సెక్షన్ 87A రిబేట్ రూల్స్ ఏంటి? వీరికి ఎలాంటి పన్ను ఉండదు!

Section 87A Rebate Rules (Image Credit To Original Source)

Updated On : January 25, 2026 / 5:33 PM IST

Union Budget 2026 : బడ్జెట్ 2026 టైమ్ దగ్గరపడుతోంది.. పన్నుచెల్లింపుదారులు సహా సామాన్య ప్రజలందరూ ఇప్పుడు బడ్జెట్ గురించే చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కు ముందే అన్ని వర్గాలపై అనేక భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఇప్పుడు టాక్స్ రిబేట్ గురించి ఎక్కువగా వినిపడుతోంది.

ఈసారి బడ్జెట్‌లో సెక్షన్ 87A కింద ఆదాయపు పన్ను రిబేటుపై ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని 87A రిబేట్ రూల్స్ ఏంటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు? పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానంలో ఎలా వర్క్ అవుతుంది? రిబేట్ లిమిట్ ఎంత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? అనే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ప్రస్తుతం కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం, 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి టాక్స్ రిబేట్ రూ. 60 వేలు మాత్రమే.. అంటే.. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి టాక్స్ రిబేట్ కింద టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రిబేట్ టాక్స్ లిమిట్ కూడా ఇంకా పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రస్తుత నిబంధనల్ని సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టాక్స్ రిబేట్ ఏంటి? ఎవరికి వర్తిస్తుంది? :
సాధారణంగా టాక్స్ పేయర్లకు కేంద్ర ప్రభుత్వం టాక్స్ రిబేట్ ద్వారా రాయితీని అందిస్తుంది. అంటే.. ఆదాయంపై చెల్లించే మొత్తంలో పన్నుపై రాయితీ పొందవచ్చు. ఐటీ టాక్స్ సెక్షన్ 87A కింద ఈ రిబేటు పొందవచ్చు. మీకు పరిమిత ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను కూడా పడదు.

మన దేశంలో ఉండేవారికి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అదే ఎన్ఆర్ఐలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), ఇతర కంపెనీలకు ఈ రిబేటు రూల్ వర్తించదు. అలాగే, క్యాపిటల్ గెయిన్స్ తరహాలో స్పెషల్ రేట్లు వర్తించే ఆదాయంపై కూడా ఈ రిబేటు వర్తించదు. ఇక, పాత, కొత్త పన్ను విధానాల్లో ఈ టాక్స్ రిబేట్ ఎలా వర్తిస్తుందో వివరంగా తెలుసుకుందాం..

Read Also : Union Budget 2026 : 10ఏళ్లుగా నిరీక్షణ.. ఈసారి మిడిల్ క్లాసుకు బిగ్ రిలీఫ్..సెక్షన్ 80C పరిమితి రూ. 3 లక్షలకు పెంపు? హోం లోన్లపై టాక్స్..!

పాత పన్ను విధానం విషయానికి వస్తే..
సెక్షన్ 87A కింద టాక్స్ రిబేట్ రూ. 12,500 మాత్రమే. అంటే.. రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను పడదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు అలాగే ఉంటుంది. ఉద్యోగులు పాత పన్ను కింద రూ. 5.50 లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి సందర్భాల్లోనే టాక్స్ రిబేట్ వర్తిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రం టాక్స్ శ్లాబుల ఆధారంగా పన్ను కట్టాల్సి ఉంటుంది.

కొత్త పన్ను విధానం ప్రకారం..
టాక్స్ రిబేటు రూ. 25 వేలకు వర్తిస్తుంది. టాక్స్ రిబేట్ పరిశీలిస్తే రూ. 7 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ పడదు. అప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు ఉంటే.. రూ. 7.75 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను పడదు. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఇదే టాక్స్ రిబేట్ వర్తించేది.

కానీ, 2025 బడ్జెట్‌లో ఈ టాక్స్ రిబేట్ పై అనేక మార్పులు చేశారు.వాస్తవానికి, 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌ ఆదాయంపై 2026-27 ఆర్థిక సంవత్సరం టాక్స్ రిబేట్ రూ. 60 వేలు ఉంటే.. కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన పనిలేదు.

జీతం పొందే ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో మొత్తం రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. టాక్స్ శ్లాబులతో లెక్కిస్తే చెల్లించాల్సిన పన్ను రూ. 60 వేలు ఉంటుంది. టాక్స్ రిబేటుగా రూ. 60 వేలు ఉంటే జీరో టాక్స్ పడుతుంది. ఆదాయ పరిమితి పెరిగినా కూడా పన్ను భారం పడకుండా పన్నుచెల్లింపుదారులకు మార్జినల్ రిలీఫ్ కూడా ఉంది.

2026 బడ్జెట్‌లో టాక్స్ రిబేట్ లిమిట్ పెంచాల్సిందిగా పన్నుచెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. టాక్స్ రిబేట్ పెంచితే రూ. 12.75 లక్షలకు పైగా ఆదాయంపై కూడా భారీ మొత్తంలో టాక్స్ తగ్గుతుంది. ప్రస్తుత పరిమితి ప్రకారం రూ. 12 లక్షలకుపైగా ఆదాయం ఉంటే పన్ను భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే రిబేట్ లిమిట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.