ఆస్ట్రీయన్ మోటర్ సైకిల్ మేకర్ KTM ఇండియన్ మార్కెట్లో కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్ చేసింది. అదే.. Duke 790 నేకడ్ స్పోర్ట్స్ బైక్.
ఆస్ట్రీయన్ మోటర్ సైకిల్ మేకర్ KTM ఇండియన్ మార్కెట్లో కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్ చేసింది. అదే.. Duke 790 నేకడ్ స్పోర్ట్స్ బైక్. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 8.63 లక్షలు (ఎక్స్-షోరూం). ప్రస్తుతం ఈ కొత్త స్పోర్ట్స్ బైక్ ప్రధాన నగరాలైన ముంబై, పుణె, సూరత్, ఢిల్లీ, కోల్ కతా, గువాహటి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా మొత్తం 9 సిటీల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయిన ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్, డ్యుకేటీ మానిస్టర్ 821, సుజూకీ GSX-S750, కవాస్కీ z900లతో పోటీగా కొత్త KTM Duke 790 స్పోర్ట్స్ బైక్ రిలీజ్ అయింది. కంపెనీ డీలర్ షిప్ ల దగ్గర కొత్త KTM స్పోర్ట్స్ బైక్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో భారతీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో సొంత KTM ఇండస్ట్రీస్ AG కంపెనీ రిలీజ్ చేసిన ఫస్ట్ హై-పర్ ఫార్మానెన్స్ మోటార్ సైకిల్ KTM Duke 790 ఇదే. ఇండియాలో KTM Duke 790 స్పోర్ట్స్ బైక్ CKD (కంప్లీట్లీ నాక్ డ్ డౌన్) యూనిట్ గా అందుబాటులో ఉంటుంది. 2019లో కేవలం 100 యూనిట్ల వరకు మాత్రమే పరిమితి ఉంది. KTM గ్లోబల్ లైనప్ లో ట్రెలిస్ ఫ్రేమ్, సింగిల్ పీస్ అల్యూమినియం రియర్ సబ్ ఫ్రేమ్ తో వచ్చిన 690 Duke, 1290 Supre Duke R సేల్స్ పడిపోయిన నేపథ్యంలో KTM Duke 790ని కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
Duke 790 బైక్.. 17 అంగుళాల అలోయ్ వీల్స్ తో పాటు మ్యాక్సీస్ సూపర్ మ్యాక్స్ ST టైర్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. స్టేబులిటీ కంట్రోల్ సిస్టమ్, కార్నిరింగ్ ABS, మోటార్ స్లిప్ రెగ్యులేషన్, ట్రాక్షన్ కంట్రోల్ యూనిట్, లీన్ యాంగిల్, రైడ్ బై వైర్ ఇలా ఎన్నో ఉన్నాయి. బైక్ పొడిగా ఉన్నప్పుడు దాని బరువు కేవలం 169 కిలోలు మాత్రమే ఉంటుంది. బైక్ సిగ్మంట్లలో కొత్త duke 790 అతి తేలికైన బైక్ ఇదొకటిగా చెప్పుకోవచ్చు.
KTM Duke 790 ఫీచర్లు ఇవే :
* ఫుల్లీ డిజిటల్ TFF ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ప్యానెల్
* LED హెడ్, టైల్ ల్యాంప్స్, టర్న్ సిగ్నల్స్
* నాలుగు డిఫరెంట్ రైడింగ్ మోడ్స్
* స్పోర్ట్, స్ట్రీట్, రెయిన్, ట్రాక్ మోడల్స్
* LC8 799cc, లిక్విడ్ – కూల్డ్
* ప్యారలెల్ ట్విన్ ఇంజిన్
* 105 PS పవర్, 9,500 rpm
* 86 Nm torque, 8,000 rpm
* 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్
* WP సోర్సడ్ USD ఫోర్క్ (ఫ్రంట్)
* mono-shock (రియర్)
* 300mm డ్యుయల్ డిస్క్ (ఫ్రంట్)
* 240mm సింగిల్ డిస్క్ ( రియర్)