×
Ad

Lamborghini Terzo Millennio : కొత్త సూపర్ కారు వస్తోందోచ్.. ఇక ఫ్యూచర్ అంతా ఇవే.. సెల్ఫ్ రిపేరింగ్ దీని స్పెషాలిటీ.. హై రేంజ్ టెక్నాలజీ అంతే..!

Lamborghini Terzo Millennio : అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త లంబోర్గిని టెర్జో మిలీనియో సూపర్ కారు రాబోతుంది. ఈ కారు దానికి అదే సెల్ఫ్ రిపేరింగ్ చేసుకోగలదు. లంబోర్గిని మార్కెట్ షేక్ చేయబోతోంది.

Lamborghini Terzo Millennio

Lamborghini Terzo Millennio : సూపర్ కారు వస్తోందోచ్.. ఇక ఫ్యూచర్ అంతా ఈ సూపర్ కారులే కనిపించనున్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్టుగా కొత్త లంబోర్గిని టెర్జో మిలీనియో సూపర్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న కార్ల కన్నా హై రేంజ్ అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తోంది. 3వేల ఏళ్ల తర్వాత సూపర్ కారు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సూపర్ కార్ల అభిమాని అయితే ఇది మీకోసమే..

లంబోర్గిని టెర్జో మిలీనియో సూపర్ కారు (Lamborghini Terzo Millennio) భవిష్యత్తులో ఇలానే ఉండబోతుంది. ఇది కేవలం కాన్సెప్ట్ కారు కాదు.. భవిష్యత్తులో స్పోర్ట్స్ కార్లు ఎలా ఉండనున్నాయో అంచనా వేయొచ్చు. టెర్జో మిలీనియో అంటే మూడో మిలీనియం అని అర్థం. ఈ కారు నిజంగా రాబోయే వెయ్యి సంవత్సరాల్లో లంబోర్గిని మార్కెట్ షేక్ చేయనుంది. ఈ అద్భుతమైన సూపర్ కారు ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..

టెర్జో మిలీనియో :
లంబోర్గిని టెర్జో మిలీనియో కేవలం కారు మాత్రమే కాదు.. మొబైల్ సైన్స్ ల్యాబ్. లంబోర్గిని MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ కారు 4 ప్రధాన సూత్రాలపై రన్ అవుతుంది. పవర్, ఇన్నోవేషన్, ఆర్కిటెక్చర్, ఎమోషన్. అంటే కారు వేగంగా దూసుకెళ్లడమే కాకుండా సొంతంగా పవర్ స్టోర్ చేస్తుంది. తనకు తానే రిపేర్ చేస్తుంది. డ్రైవర్‌తో ఎమోషన్ రిలేషన్ కలిగి ఉంటుంది. ఫ్యూచర్‌లో ఈ సూపర్ కార్లు స్పీడ్ ఐకాన్లు మాత్రమే కాకుండా టెక్నాలజీ పరంగా మరింత అడ్వాన్స్‌గా ఉంటాయిని చెప్పవచ్చు.

వర్చువల్ రియాల్టీ, డిజైన్ :

మీరు ఫస్ట్ టైమ్ టెర్జో మిలీనియోను చూస్తే మీరు అది మరో గ్రహం నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. డిజైన్ పరిశీలిస్తే.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టుగా ఉంటుంది. కారు బాడీలో ఒక్క లైన్ కూడా లేదు. ప్రతిదీ కర్వ్స్, షార్ప్ యాంగిల్స్ ద్వారా రూపొందింది. ఈ డిజైన్ బ్యూటీ కోసమే మాత్రమే కాదు.. ఏరోడైనమిక్స్ కోసం కూడా. కారు ఫ్రంట్ సైడ్ స్పేస్ క్రాఫ్ట్ పోలి ఉంటుంది. బ్యాక్ సైడ్ కారును నేలపై ఉంచే బిగ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. కారులో విండ్‌షీల్డ్ కూడా లేదు. అంటే డ్రైవర్ బయట చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ వర్చువల్ రియాలిటీ ద్వారా కనిపిస్తుంది.

Read Also : Flipkart Black Friday Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఇంతకన్నా తక్కువ ధరకు మళ్లీ దొరకవు..!

సెల్ఫ్ రిపేరింగ్ టెక్నాలజీ :
టెర్జో మిలీనియో సూపర్ కారులో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. సెల్ఫ్ రిపేరింగ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ సూపర్ కారు దానికి అదే రిపేర్ చేసుకోగలదు. కారు బాడీ కార్బన్ ఫైబర్‌తో తయారైంది. కానీ, ఒక స్పెషల్ టెక్నాలజీ కలిగి ఉంది. కార్బన్ ఫైబర్ బాడీలో పగుళ్లు లేదా నష్టం జరిగితే కారు దానికి అదే ఆటోమాటిక్‌గా రిపేరింగ్ చేస్తుంది.

ఇది ఎలా పని చేస్తుందంటే.. కార్బన్ ఫైబర్ లోపల ఒక స్పెషల్ కెమికల్ నిండిన మైక్రోక్యాప్సూల్స్ ఉంటాయి. కారు బాడీలో పగుళ్లు కనిపించినప్పుడు వెంటనే అవి పగిలిపోతాయి. ఆ పగుళ్లు ఉన్న చోట కెమికల్ రిలీజ్ అయి కొత్తదానిలా మెరుస్తుంది. ఈ టెక్నాలజీతో కారు లైఫ్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

సూపర్ కెపాసిటర్ ఎనర్జీ స్టోరేజ్ :

నేటి ఎలక్ట్రిక్ కార్లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. కానీ, టెర్జో మిలీనియో సూపర్ కారులో పూర్తిగా కొత్త టెక్నాలజీతో రానుంది. బ్యాటరీల కన్నా అత్యంత పవర్‌ఫుల్ సూపర్ కెపాసిటర్లను కలిగి ఉంది. ఈ సూపర్ కెపాసిటర్లు కారు బాడీ అంతటా అమర్చి ఉంటాయి. వీల్స్, బాడీ ప్యానెల్‌లలో ప్రతిచోటా అంటే మొత్తం కారు ఒక భారీ బ్యాటరీలా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ బ్యాటరీ ఛార్జింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ మొత్తంలో శక్తిని అందిస్తుంది. మీ కారు బాడీ కూడా పవర్ స్టోర్ చేస్తుంది అనమాట.

పవర్‌ట్రెయిన్ :
టెర్జో మిలీనియోలో 4 వేర్వేరు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ప్రతి వీల్ ఒకటి.. ప్రతి వీల్ విడివిడిగా కంట్రోల్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ కారుకు అత్యంత కంట్రోలింగ్ అందిస్తుంది. సూపర్ కారులో ప్రతి వీల్ సపరేట్ స్పీడ్ తిరుగుతుంది. కారు కచ్చితత్వంతో వస్తుంది. ఈ సిస్టమ్ మంచు లేదా వర్షం వంటి జారే రోడ్లపై కారుకు గట్టు పట్టును కూడా అందిస్తుంది. ప్రతి మోటారు చాలా పవర్‌ఫుల్ కారు.. రాకెట్ లాగా స్పీడ్ దూసుకెళ్తుంది. అయినప్పటికీ లంబోర్గిని ఇంకా కచ్చితమైన పర్ఫార్మెన్స్ వివరాలను రివీల్ చేయలేదు.

భారత మార్కెట్లోకి వస్తుందా? :
ఈ సూపర్ కారు టెర్జో మిల్లెనియో ప్రస్తుతం కేవలం కాన్సెప్ట్ కారు మాత్రమే.. ప్రొడక్టుల మార్కెట్లోకి రాదు. భారతీయ మార్కెట్లోకి ఇప్పట్లో చూసే అవకాశం లేదు. కానీ, ఈ కారు టెక్నాలజీ పరంగా భవిష్యత్తులో లంబోర్గిని ప్రొడక్షన్ కార్లలో కనిపిస్తుంది. సెల్ఫ్-హీలింగ్ బాడీలు, సూపర్ కెపాసిటర్లు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ల వంటి టెక్నాలజీలు క్రమంగా అన్ని కార్లలోనూ వచ్చే అవకాశం ఉంది. టెర్జో మిల్లెనియో ఫ్యూచర్ ఎలక్ట్రిక్‌ సూపర్‌కార్లుగా రావొచ్చు. నేటి కార్ల కన్నా అత్యంత వేగంగా అడ్వాన్స్‌గా ఉంటాయి.