Flipkart Black Friday Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఇంతకన్నా తక్కువ ధరకు మళ్లీ దొరకవు..!

Flipkart Black Friday Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఇంతకన్నా తక్కువ ధరకు మళ్లీ దొరకవు..!

Flipkart Black Friday Sale 2025

Updated On : November 25, 2025 / 7:33 PM IST

Flipkart Black Friday Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సీజన్‌లో సరసమైన ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. మీరు అప్‌గ్రేడ్ విషయానికి వస్తే.. భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌‌లు పొందవచ్చు.

టాప్ ఆఫర్లలో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S24, గెలాక్సీ S24 అల్ట్రాలపై (Flipkart Black Friday Sale 2025) ధరల తగ్గింపులు పొందవచ్చు. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ భారీ 6.7-అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో రన్ అవుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 4,900mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫొటోల విషయానికి వస్తే.. 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్‌తో సహా 3 బ్యాక్ కెమెరాలను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరాను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర భారీగా తగ్గింది. ఈ శాంసంగ్ ఫోన్ రూ.99,999కి లాంచ్ అయింది. ఇప్పుడు రూ.74,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లించే యూజర్లు అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. ధర మరింత తగ్గించే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు ట్రేడ్ చేసే ఫోన్‌ను బట్టి బెనిఫిట్స్ రూ.68,050 వరకు ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ S24 :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 512GB స్టోరేజీని అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత వన్ యూఐ 8తో వస్తుంది.

Read Also : Best Upcoming Phones : గెట్ రెడీ బ్రో.. మార్కెట్ షేక్ చేయబోయే టాప్ 5 బెస్ట్ అప్‌కమింగ్ ఫోన్లు ఇవే.. వన్‌ప్లస్ నుంచి ​రియల్‌మి వరకు..!

25W ఛార్జింగ్‌తో 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C, IP68 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇచ్చే 50MP మెయిన్ లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 12MP వంటి ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S24 ధర ఎంతంటే? :

శాంసంగ్ గెలాక్సీ S24 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.40,999కి అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.74,999 నుంచి రూ.34వేల వరకు తగ్గింది. SBI లేదా Axis ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు ట్రేడ్ చేసే శాంసంగ్ ఫోన్ బట్టి ధర రూ.38,950 వరకు తగ్గించే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. పవర్‌పుల్ కలర్లు, యానిమేషన్‌లను అందిస్తుంది. అడ్రినో 750 జీపీయూతో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. భారీ గేమింగ్ సమయంలో కూడా లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫొటోగ్రఫీ కోసం 200MP మెయిన్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో సహా పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 12MP కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో సాధారణ ధర రూ.1,19,999 నుంచి రూ.86,999కి తగ్గింపు పొందింది. ఆసక్తిగల కస్టమర్లు SBI లేదా Axis ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌లతో రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ.68,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.