Petrol Price Hike : లీటర్ పెట్రోల్ రూ.254.. ఎక్కడంటే ?

రష్యా-యుక్రెయిన్  యుధ్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై  తీవ్ర ప్రభావం చూపుతోంది.   ఫలితంగా  పలు దేశాలలో ఆయిల్ రేట్లు  భారీగా పెరిగాయి.  శ్రీలంకలోని ఆయిల్ కంపెనీ  లంక ఇండియన్ ఆయి

Petrol Price Hikes :  రష్యా-యుక్రెయిన్  యుధ్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై  తీవ్ర ప్రభావం చూపుతోంది.   ఫలితంగా  పలు దేశాలలో ఆయిల్ రేట్లు  భారీగా పెరిగాయి.  శ్రీలంకలోని ఆయిల్ కంపెనీ  లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ దేశంలో చమురు ధరలు భారీగా పెంచింది.

లీటర్ పెట్రోల్ పై రూ. 50 , లీటర్ డీజిల్ పై రూ. 75 పెంచింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 254 కాగా, డీజిల్ లీటరు 214కి  చేరింది. శ్రీలంక రూపాయి  భారీగా పతనమైనందును చమురు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

శ్రీలంకలో గడిచిన  11 రోజుల్లో ఇంధన ధరలు పెంచటం ఇది మూడోసారి. ధరల పెంపుపై ఎల్ ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్   మనోజ్ గుప్త మాట్లాడుతూ….. శ్రీలంక రూపాయి విలున భారీగా   పతనమై డాలర్‌తో   పోలిస్తే రూ. 57కు తగ్గింది.  రూపాయి విలువ పతనమవటం  వారం రోజుల్లో ఇది రెండో సారి. ఇది  చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద నేరుగా ప్రభావం చూపించిందని ఆయన అన్నారు.
Also Read : Telangana Cong : టీడీపీ వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..ఇంతే మరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎల్ఐఓసీ  శ్రీలంక   ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు పొందదని… ఫలితంగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణమాల నేపధ్యంలో  రేట్లు పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.    కాగా శ్రీలంక ఆయిల్ కంపెనీ  అయిన   సిలోన్  పెట్రోలియం కార్పోరేషన్ ఇంతవరకు  ఆయిల్ ధరలు పెంచటంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు