Lenovo Yoga 7 Laptop : టచ్ డిస్‌ప్లేతో లెనోవో కొత్త యోగా 7ఐ 2-ఇన్-1 ల్యాప్‌టాప్.. భారత్‌లో ధర ఎంతంటే?

Lenovo Yoga 7 Laptop : కొత్త ల్యాప్‌ట్యాప్ కొంటున్నారా? భారత మార్కెట్లో లెనోవో కొత్త యోగా 7ఐ 2-ఇన్-1 కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది.

Lenovo Yoga 7 Laptop : టచ్ డిస్‌ప్లేతో లెనోవో కొత్త యోగా 7ఐ 2-ఇన్-1 ల్యాప్‌టాప్.. భారత్‌లో ధర ఎంతంటే?

Lenovo Yoga 7 2-in-1 laptop with 14-inch OLED touch display

Lenovo Yoga 7 Laptop : కొత్త ల్యాప్‌ట్యాప్ కొంటున్నారా? భారత మార్కెట్లో లెనోవో కొత్త యోగా 7ఐ 2-ఇన్-1 కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. పోర్టబిలిటీతో కూడిన ఇంటెల్ ఏఐ బూస్ట్ ఎన్‌పీయూ‌‌తో సరికొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా (సిరీస్ 1) హెచ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. యోగా 7ఐ మల్టీ టాస్కింగ్‌ కోసం 32జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్-7500 మెమరీ ఆప్షన్ కలిగి ఉంది.

Read Also : WhatsApp Green Colour : మీ వాట్సాప్ గ్రీన్‌‌ కలర్‌లోకి మారిందా? ఈ మార్పునకు కారణమేంటి? యూజర్ల రియాక్షన్ ఇదిగో!

ఫంక్షనింగ్ యాక్సస్ కోసం మైక్రోసాఫ్ట్ కో-పైలట్ కీని కలిగి ఉంది. తగినంత స్టోరేజీ, పర్ఫార్మెన్స్ కోసం 1టీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజీతో అద్భుతమైన 14-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఓఎల్ఈడీ ఆప్టిమైజేషన్‌ లోకల్ వీడియో ప్లేబ్యాక్‌ను 2 గంటల వరకు అందిస్తుంది. అయితే, 2.8కె ప్యూర్‌సైట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

లెనోవో యోగా 7ఐ 2-ఇన్-1 భారత్ ధర ఎంతంటే? :
ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సీపీయూ, 2.8K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో లెనోవో యోగా 7ఐ 2-ఇన్-1(2024) మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 1,01,990కు అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ టైడల్ టీల్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

లెనోవో యోగా 7ఐ 2-ఇన్-1 స్పెసిఫికేషన్‌లు :
లెనోవో యోగా 7ఐ 2-ఇన్-1 ల్యాప్‌టాప్ విండోస్ 11లో రన్ అవుతుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో పాటు ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సీపీయూల ద్వారా పవర్ పొందుతుంది. సాంప్రదాయ హోమ్ కీ స్థానంలో విండోస్ కోపైలట్ ఏఐ కోసం ప్రత్యేక కీని కూడా కలిగి ఉంది. 32జీబీ వరకు (LPDDR5X) ర్యామ్‌ను అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల (WUXGA) ఓఎల్ఈడీ స్క్రీన్ 1,920×1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్‌ల గరిష్ట ప్రకాశం ఉంది. హై రిజల్యూషన్‌ను ఇష్టపడే వారికి 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 2.8K ఓఎల్ఈడీ స్క్రీన్ ఆప్షన్ ఉంది. రెండు డిస్‌ప్లేలు విడివిడిగా విక్రయించే లెనోవో డిజిటల్ పెన్‌కు సపోర్టు ఇస్తాయి.

ల్యాప్‌టాప్ 1టీబీ వరకు పీసీఐఈ ఎమ్.2 జనరేషన్4 ఎస్ఎస్‌డీ స్టోరేజీని అందిస్తుంది. వేగంగా డేటా యాక్సెస్, ఫైల్‌లు, అప్లికేషన్‌లకు తగినంత స్టోరేజీని అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. లెనోవో యోగా 7ఐ 2-ఇన్-1 వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.2 సపోర్ట్‌తో పాటు రెండు థండర్‌బోల్డ్ 4/యూఎస్‌బీ 4.0 పోర్ట్‌లు, యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-ఎ పోర్ట్, హెచ్‌డీఎంఐ 1.4బీ పోర్ట్, ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడర్, కాంబో ఆడియో జాక్ కలిగి ఉంది. లెనోవో ట్రూబ్లాక్ ప్రైవసీ షట్టర్, 2 ఇంటర్నల్ మైక్రోఫోన్‌లతో కూడిన 2ఎంపీ ఫుల్-హెచ్‌‌డీ+ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను కలిగి ఉంది.

ల్యాప్‌టాప్‌లో 71డబ్ల్యూహెచ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీతో వచ్చింది. రాపిడ్ ఎక్స్‌ప్రెస్ ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. 15 నిమిషాల ఛార్జ్‌తో 3 గంటల వినియోగాన్ని అందిస్తుంది. లోకల్ వీడియో ప్లేబ్యాక్ సమయంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ లైఫ్ 22.5 గంటల వరకు ఉంటుంది. లెనోవో యోగా 7ఐ 2-ఇన్-1 ఒక ఏడాది బేస్ వారంటీతో వస్తుంది. ఒక ఏడాది డిపో/క్యారీ-ఇన్ నుంచి ఆన్‌సైట్ అప్‌గ్రేడ్‌తో ఒక ఏడాది ప్రీమియం కేర్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది.

డిజైన్ పరంగా, ల్యాప్‌టాప్ డాల్బీ విజన్, డిస్‌ప్లే హెచ్‌డీఆర్, 100శాతం డీసీఐ-పీ3 కలర్ కవరేజీతో కూడిన (WUXGA) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్‌లిట్ ఇంగ్లీష్ కీబోర్డ్, బటన్‌లెస్ గ్లాస్ లాంటి మైలార్ సర్ఫేస్ టచ్‌ప్యాడ్‌ను కలిగి ఉంది. టైడల్ టీల్ కేస్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్ కేస్ అల్యూమినియంతో తయారైంది. శాండ్‌బ్లాస్టింగ్‌తో యానోడైజ్డ్ ఫినిషింగ్‌ కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తేలికైనది. 1.49కిలోలు (3.28lbs) ఉంటుంది. లెనోవో 7ఐ 2-ఇన్-1 విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్‌లో రన్ అవుతుంది. ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2021తో వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీ రెండింటికీ ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్న యూజర్ల కోసం వ్యక్తిగత, వృత్తిపరమైన ఉపయోగానికి టూల్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : WhatsApp Exit India : యూజర్ల మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ బ్రేక్ చేస్తే.. భారత్ నుంచి నిష్ర్కమిస్తాం : వాట్సాప్ వెల్లడి!