Lenskart's Peyush Bansal Seeks Land For Mega Factory In Bengaluru
Lenskart Peyush Bansal : దేశంలోని ప్రముఖ కళ్లజోళ్ల రిటైలర్ బ్రాండ్ లెన్స్‌కార్ట్ సీఈఓ, వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ బెంగళూరులో మెగా ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తున్నట్టు లింక్డ్‌ఇన్ వేదికగా ప్రకటించారు. నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో మెగా ఫ్యాక్టరీని నిర్మించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 25 ఎకరాల ల్యాండ్ అవసరమని పేర్కొన్నారు. తాము కోరే ప్రదేశంలో ఏదైనా ఫ్యాక్టరీ అమ్మకానికి ఉందా బన్సల్ అభ్యర్థించారు.
‘లెన్స్‌కార్ట్ మరో మెగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కెంపెగౌడ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కి.మీ.లోపు 25 ఎకరాల ల్యాండ్ వెతుకుతోంది. ఏదైనా కంపెనీ బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ భూమిని విక్రయించాలని చూస్తున్నట్లయితే.. దయచేసి దీనికి ఇమెయిల్ పంపండి (megafactory@lenskart.in) అని బన్సల్ లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు.
బన్సల్ విజ్ఞప్తితో స్పందించిన కర్ణాటక మంత్రి :
బన్సల్ విజ్ఞప్తితో కర్ణాటక వాణిజ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల మంత్రి ఎంబీ పాటిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లెన్స్‌కార్ట్‌కు తమ రాష్ట్ర ప్రభుత్వ మద్దతును ధృవీకరించారు. దీనికి సంబంధించి అధికారులు వెంటనే బన్సల్ సపోర్టు అందిస్తారని పాటిల్ హామీ ఇచ్చారు. బెంగళూరులో లెన్స్‌కార్ట్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంలో సాయం చేసేందుకు మంత్రి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.
Karnataka is the place to be! @peyushbansal @Lenskart_com Industries Department is here to support you, and facilitate all your needs.
Concerned officials will reach out, immediately. pic.twitter.com/9KTikkx8GJ
— M B Patil (@MBPatil) April 9, 2024
2008లో స్థాపించిన లెన్స్‌కార్ట్ విస్తృతమైన కళ్లజోళ్లు, కళ్లద్దాలు, సన్‌గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్‌లు, విజన్ కేర్ సర్వీసులను అందిస్తుంది. భారత్, సింగపూర్, దుబాయ్‌లోని 175 నగరాల్లోని కస్టమర్‌లకు సేవలందిస్తున్న 1,500 ఓమ్నిచానెల్ స్టోర్‌లలో కంపెనీని మరింతగా విస్తరించింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మందికి సేవలందించే ప్రతిష్టాత్మక లక్ష్యంతో లెన్స్‌కార్ట్ కళ్లజోళ్ల పరిశ్రమలో ముందుకు కొనసాగుతోంది.
Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?