Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. పాత ఐఫోన్‌లపై అదనపు ఎక్స్‌ఛేంజ్ వాల్యూను కూడా పొందవచ్చు.

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?

Planning to buy an Apple iPhone 15_ You should check out the deal on Flipkart

Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు ఐఫోన్ 15 అందుబాటులో ఉంది. 128GB స్టోరేజ్ మోడల్‌ అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు అదే ఐఫోన్ రూ.65,000లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

Read Also : Apple Watch Series 9 : క్రోమాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఐఫోన్ 15 ఒకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ ఎ16 బయోనిక్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంది. గతంలో ఐఫోన్ 14 సిరీస్‌లోని ప్రో మోడల్‌లకు ప్రత్యేకమైన ఫీచర్ కూడా. ఐఫోన్ పవర్‌ఫుల్ కెమెరాల సెట్‌ను కలిగి ఉంది. హై-క్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ 128జీబీ స్టోరేజ్‌ ధర రూ. 65,999 ఉండగా రూ. 13,901కు తగ్గింపు పొందవచ్చు. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ రూ. 79,900 వద్ద లాంచ్ అయింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ రూ. 50వేల ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా అందిస్తోంది. మీ వద్ద పాత ఐఫోన్ ఉంటే.. పాత ఫోన్‌కు రూ. 50వేల వరకు పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హై రిజల్యూషన్ అందిస్తుంది. ఐఫోన్ 15 సరికొత్త ఎ16 బయోనిక్ చిప్ కలిగి ఉంది. పవర్‌ఫుల్ చిప్, అధునాతన డిస్‌ప్లేతో టాప్ రేంజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్‌లోని కెమెరా సిస్టమ్ గత మోడల్‌తో పోలిస్తే.. గణనీయమైన అప్‌గ్రేడ్‌ కలిగి ఉంది.

ఈ కొత్త 48ఎంపీ ప్రధాన సెన్సార్‌తో తక్కువ-కాంతి పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాలకు విస్తరించి యూజర్లను విస్తృత శ్రేణి ఫోటోగ్రఫీ ఆప్షన్లను అందిస్తుంది. అదనపు భద్రత విషయానికి వస్తే.. కొత్త అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను యూఎస్‌బీ-సి పోర్ట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 15 ప్లస్ గత వెర్షన్ల కన్నా అత్యాధునికమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ చిప్, మెరుగైన కెమెరా సిస్టమ్, అదనపు ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Read Also : Flipkart Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 15, పిక్సెల్ 8 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?