LIC New Service
LIC New Service : ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారుల కోసం కీలక ప్రకటన చేసింది. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి మీరు ఏజెంట్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు.
ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా ఇంట్లో కూర్చుని ప్రీమియం చెల్లించవచ్చు. ఇందుకోసం ఎల్ఐసీ వాట్సాప్ బాట్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఇంట్లో కూర్చుని ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రీమియం చెల్లించడానికి LIC 8976862090 నంబర్‌ను జారీ చేసింది. మీరు ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపి మీ పాలసీని UPI ద్వారా చెల్లించవచ్చు.
ఈ ఆప్షన్ LIC కస్టమర్లకు ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించే అవకాశాన్ని ఇస్తుందని బీమా కంపెనీ తెలిపింది. తద్వారా, వినియోగదారులు బాట్‌లోనే పేమెంట్ చేయగలరు.
ఈ ఫీచర్ ఇలా పనిచేస్తుందంటే? :
వాట్సాప్ ద్వారా పాలసీ కోసం చెల్లించడానికి ముందుగా మీరు 8976862090కు హాయ్ అని పంపాలి. ఆ తర్వాత బాట్ యాక్టివ్ అవుతుంది. మీ చాట్ స్క్రీన్‌లో అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.
మీరు పొందాలనుకుంటున్న సర్వీసును ఎంచుకోవాలి. ఉదాహరణకు.. మీరు పాలసీ ప్రీమియం చెల్లించాల్సి వస్తే.. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.