దీనికి కూడానా : IRCTC యూజర్ ఐడీతో ఆధార్ లింక్ తప్పనిసరి

రైల్వే ప్రయాణికులకు అలర్ట్... IRCTC వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారా? ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిందే.

  • Publish Date - September 27, 2019 / 10:54 AM IST

రైల్వే ప్రయాణికులకు అలర్ట్… IRCTC వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారా? ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిందే.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్… IRCTC వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారా? ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిందే. రెగ్యులర్‌గా రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకునే IRCTC యూజర్ల కోసం భారత రైల్వే అమేజింగ్ బెనిఫెట్స్ ఆఫర్ చేస్తోంది. దీంతో ప్రయాణికులు నెలలో 12 టికెట్లు వరకు బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్ సీటీసీ అనుమతి ఇస్తోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. తప్పనిసరిగా యూజర్లు IRCTC IDని ఆధార్ కార్డుతో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. 

దీనిలో భాగంగా IRCTC కూడా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రయాణికుల్లో ఎవరైన ఒకరి ఆధార్ కార్డు ద్వారా వెరిఫై చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది. ఒక నెలలో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య 6లోపు ఉంటే.. IRCTC ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలో ఆధార్ వెరిఫికేషన్ అవసరం లేదని సంస్థ తెలిపింది. ప్రత్యేకించి ఐఆర్ సీటీసీ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ ను ప్రకటించింది. ఆధార్ KYC ఆప్షన్ ద్వారా యూజర్లు తమ ఆధార్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ పోర్టల్ లో యూజర్ ప్రొఫైల్ దగ్గర వెరిఫై ఆప్షన్ ఉంటుంది.

IRCTC యూజర్ తో పాటు రైల్లో ప్రయాణించే ప్రయాణికుల ఆధార్ కార్డు నెంబర్లను కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాసింజర్ మాస్టర్ లిస్టులో ప్రయాణికులందరి ఆధార్ వివరాలను పొందుపరచడం జరుగుతుంది. ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి ముందే ఐఆర్ సీటీసీ యూజర్ డేటాలో ఎంటర్ చేయడం పూర్తి చేయాలని సంస్థ వెల్లడించింది. ట్రైన టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలో ప్యాసెంజర్ మాస్టర్ లిస్టులో వెరిఫై చేసిన ఆధార్ నెంబర్లను యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక నెలలో అదనంగా 12 టికెట్ల వరకు బుకింగ్ చేసుకోవచ్చు. 

IRCTC యూజర్ ఐడీతో ఆధార్ వెరిఫికేషన్ : 
* అధికారిక IRCTC వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి.
* పోర్టల్ లో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో Login అవ్వండి.
* My accountలోకి వెళ్లి Link Aadhaar లింక్ పై క్లిక్ చేయండి.
* ఆధార్ KYC పేజీ స్ర్కీన్ పై కనిపిస్తుంది.
* మీ పేరు.. మీ ఆధార్ కార్డుపై ఎలా ఉందో అలానే ఉండాలి.
* ఆధార్ నెంబర్ లేదా Virtual ID వివరాలను ఇవ్వాలి.
* చెక్ బాక్సు మీద క్లిక్ చేయండి. 
* Send OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* రిజిస్ట్రర్డ్ మొబైల్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
* వెరిఫై OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* Update Aadhaar అనే బటన్ పై క్లిక్ చేయండి. 
* అప్పుడే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. 
* IRCTC eTicketing వెబ్ సైట్లో My Account అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి.
* మీ Aadhaar లింక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

నెలలో 6 టికెట్ల కంటే ఎక్కువ టికెట్లు బుకింగ్ :
* IRCTC యూజర్ ID ఆధార్ తో వెరిఫై తప్పనిసరి.
* ప్రయాణికుల్లో ఒకరు తప్పనిసరిగా ఆధార్ వెరిఫై చేసుకోవాలి.
* బుకింగ్ సమయంలో ఆధార్ వెరిఫై అయిన ప్రయాణికుడు సేవ్ చేసిన ప్యాసింజర్ లిస్టులో ఉండాలి.
* IRCTC అకౌంట్లో లాగిన్ కాగానే.. జర్నీ వివరాలు ఎంటర్ చేసి టికెట్లు బుకింగ్ చేయాలి.
* ట్రైన్ లిస్టులో బుక్ చేసుకునే ట్రైన్/క్లాసును ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రారంభించాలి.
* ప్యాసింజర్ ఇన్ పుట్ పేజీలో MY saved Passenger (s)పై క్లిక్ చేయాలి. 
* రైట్ సైడ్ ప్యానెల్ నుంచి ఆధార్ వెరిఫై చేసిన ప్యాసింజర్ ను సెలెక్ట్ చేయాలి.
* ఆటోమాటిక్ గా రిజర్వేషన్ ఫారమ్ లో ప్యాసింజర్ వివరాలు కనిపిస్తాయి. 
* మై సేవ్ డ్ లిస్టులో.. ప్రయాణికుల్లో ఒకరి ఆధార్ మాత్రం తప్పనిసరిగా వెరిఫై కావాలి.
* మిగిలిన ప్రయాణికుల ఆధార్ వివరాలను కీబోర్డు ఆధారంగా ఎంటర్ చేయాలి.
* బుకింగ్ ప్రక్రియను కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
* ప్రయాణికుల వివరాల కింద ఆధార్ నెంబర్, రివ్యూ బుకింగ్ వివరాలను చెక్ చేసుకోవాలి.
* పేమెంట్ గేట్ వే పేజీపై (క్రెడిట్ లేదా డెబిట్, వ్యాలెట్, బ్యాంకు అకౌంట్) సెలెక్ట్ చేసుకోవాలి
* పేమెంట్ సక్సస్ అయ్యాక.. బుకింగ్ ధ్రువీకరణ పేజీ డిస్ ప్లే అవుతుంది. 
* అంతే.. మీ ట్రైన టికెట్లు బుకింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టే.