Lord Automotive: 8 అధునాతన విద్యుత్ వాహనాలను విడుదల చేసిన లార్డ్స్ ఆటోమేటివ్

ఈ వాహనాల ధరలను కనిష్టంగా 49,999 రూపాయల నుంచి గరిష్టంగా 175,000 వరకు కంపెనీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు, పంపిణీదారులు, తుది వినియోగదారుల కోసం EVలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Lord Automotive: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, లార్డ్స్ ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, దేశీయ EV మార్కెట్ లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి తాజాగా ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. లార్డ్స్ ఆటోమేటివ్ 6 త్రీ-వీలర్ (3W) EV మోడళ్లను విడుదల చేసింది. లార్డ్స్ కింగ్ ఇ-రిక్షా, లార్డ్స్ సామ్రాట్ ఇ-లోడర్, లార్డ్స్ సవారీ బటర్‌ఫ్లై ఇ-రిక్షా, లార్డ్స్ గతి బటర్‌ఫ్లై ఇ-లోడర్, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన లార్డ్స్ గ్రేస్ ఇ-రిక్షా, లార్డ్స్ స్వచ్ఛ్ యాన్ ఇ-గార్బేజ్‌తో పాటు 2 హై-స్పీడ్ టూ-వీలర్ (2W) EV స్కూటర్(లార్డ్స్ ఇగ్నైట్ హై స్పీడ్ ఇ-స్కూటర్, లార్డ్స్ ప్రైమ్ హై స్పీడ్ ఇ-కార్గో స్కూటర్)లు తాజా విడుదలలో ఉన్నాయి.

Sound Party Teaser : వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన సంప‌త్ నంది.. కామెడీతో టీజర్ అదుర్స్

ఈ వాహనాల ధరలను కనిష్టంగా 49,999 రూపాయల నుంచి గరిష్టంగా 175,000 వరకు కంపెనీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు, పంపిణీదారులు, తుది వినియోగదారుల కోసం EVలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తొలిదశలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ NCR, కర్ణాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, అస్సాంలోని టైర్ 2, టైర్ 3 పట్టణాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

Muzigal Academy: స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తి ప్రతిధ్వనులతో లేటుగా, లేటెస్టుగా స్వాతంత్ర్య దినోత్సవం

లార్డ్స్ ఆటోమేటివ్ ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్, పైన్ ల్యాబ్స్, ఎజెట్యాప్, అసెండ్, అకాస ఫైనాన్స్, లోన్‌టాప్, పేటెల్, కోటక్ మహీంద్రా, పేటీఎమ్, గోపిక్, పిక్స్‌మో ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధానాల్లో కనీస వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులతో సులభమైన ఫైనాన్స్ అందుతుందని కంపెనీ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు