Sound Party Teaser : వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన సంప‌త్ నంది.. కామెడీతో టీజర్ అదుర్స్

వీజే స‌న్నీ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సౌండ్ పార్టీ' టీజర్ ని డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది రిలీజ్ చేశాడు. ఇక టీజర్ విషయానికి వస్తే..

Sound Party Teaser : వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన సంప‌త్ నంది.. కామెడీతో టీజర్ అదుర్స్

Sampath Nandi released VJ Sunny new movie Sound Party Teaser

Updated On : August 18, 2023 / 7:41 PM IST

Sound Party Teaser : బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘సౌండ్ పార్టీ’. సంజ‌య్ శేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తుంది. జయ శంకర్ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ఈ చిత్రాన్ని ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ లో మొదటి సినిమాగా నిర్మిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Aadi Keshava : వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ న్యూ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది.. కొత్త తేదీ..?

దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది ముఖ్య అతిథిగా హాజరయ్యి `సౌండ్ పార్టీ` టీజ‌ర్ ని లాంచ్ చేశాడు. టీజర్ మొత్తం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. హీరో అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవించబోతున్నాయని అర్ధమవుతుంది. ఇక ఈ టీజర్ చూసిన సంప‌త్ నంది మాట్లాడుతూ.. “సౌండ్ పార్టీ మ‌రో జాతిర‌త్నాలు సినిమాలా ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీజే స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది” అంటూ పేర్కొన్నాడు. మరి ఆ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేది ఎవరో తెలుసా..?

ఇక ఈ చిత్రం గురించి వీజే స‌న్ని మాట్లాడుతూ.. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసినట్లు, జయ శంకర్ ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా చేసిన మోహిత్ రెహమానిక్ కూడా మంచి సంగీతం అందించినట్లు పేర్కొన్నాడు.