సామాన్యుడిపై భారం : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి

  • Publish Date - March 1, 2019 / 02:40 AM IST

డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. గృహోపకర ఎల్పీజీ ఒక్కో సిలిండర్ ధరను రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ప్రకటించింది. అలాగే, సబ్సిడీయేతర ఎల్పీజీ ఒక్కో సిలిండర్ ధరను రూ. 42.50 అధికం చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

మార్చి 01వ తేదీ నుండి న్యూఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 495.61 ఉండనుండగా సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 701.50గా ఉండనుంది. ప్రతి నెలా ఒకటో తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ ధరలను సవరిస్తూ ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో మార్పుల కారణంగా ధరలను సవరించినట్లు IOC పేర్కొంటోంది. సబ్సిడీ యొక్క నగదు కూడా పెరిగిందని చెప్పింది. ఫిబ్రవరిలో రూ. 165.47 కాగా, మార్చిలో రూ. 205.89కి పెరిగిందని ఐవోసీ వెల్లడించింది. 
Read Also : వెల్‌కమ్ అభినందన్, అప్పుడే అయిపోయిందనుకోవద్దు

ట్రెండింగ్ వార్తలు