LPG Price January 1st 2025 19 Kg Commercial LPG Cylinder Prices Reduced
కొత్త సంవత్సరం తొలి రోజున గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.14.50 పైసలను తగ్గించాయి.
అదే సమయంలో గృహాలకు వినియోగించే 14.5 కిలోలో డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కొత్త సంవత్సరం తొలి రోజున భారీ శుభవార్త అందుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డొమెస్టిక్ సిలిండర్ ఉపయోగించే వారికి నిరాశ తప్పలేదు.
తగ్గిన దరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. రూ.14.50 తగ్గి ఢిల్లీలో 1818.50గా ఉన్న ధర రూ.1804కి తగ్గింది. అలాగే కోల్‌కతాలో రూ.16 తగ్గి రూ.1927గా ఉన్న ధర రూ.1911కి, ముంబైలో రూ.15 తగ్గి రూ.1771గా ఉన్న ధర రూ 1756కి, చెన్నైలో రూ.14.5 తగ్గి రూ.1980.50గా ఉన్న ధర రూ 1966 కి చేరుకున్నాయి. ఇక హైదరాబాద్‌లో రూ.2014గా ఉంది.
రెస్టారెంట్లు, క్యాటరర్లు, హోటల్స్ వంటి వారు ఎక్కువగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తూ ఉంటారు. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం వీరికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. గత కొన్ని నెలలుగా.. 19 కిలోల సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం మొదటి నెలలో ఈ ధరలకు కాస్త బ్రేక్ పడింది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు 2024 ఆగస్టు 1 నుంచి మారడం లేదు.