Indian Women Gold Reserves : ఓర్నాయనో.. మనదేశంలోని మహిళల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..? చట్టాలు ఏం చెబుతున్నాయ్..
మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Do you know how much Gold the women of our country have
మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాచీన కాలం నుంచి గోల్డ్‌ను అత్యంత విలువైన సంపదగా భావిస్తుంటారు. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రీతి. సందర్భం ఏదైన సరే మహిళల మెడల్లో బంగారం ధగధగ లాడాల్సిందే. మరి మనదేశంలో ఉన్న మహిళల వద్ద ఎంత బంగారం ఉందో మీకు తెలుసా?
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత మహిళల అందరి వద్ద దాదాపు 24 వేల టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచ నిల్వలలో 11 శాతానికి సమానం. ఈ బంగారం ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉన్నట్లుగా పేర్కొంది.
అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాల బంగారం నిల్వలతో పోలిస్తే భారతదేశంలోని మహిళల వద్దే అత్యధిక బంగారం ఉంది. అమెరికా వద్ద 8 వేల టన్నులు, జన్మనీ వద్ద 3వేల 300 టన్నులు, ఇటలీ వద్ద 2 వేల 450 టన్నులు, ఫ్రాన్స్ వద్ద 2 వేల 400 టన్నులు, రష్యా వద్ద 1,900 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ ఐదు దేశాల బంగారం నిల్వల మొత్తం కూడా భారతీయ మహిళల వద్ద ఉన్న బంగారంతో పోలిస్తే తక్కువగానే ఉండడం గమనార్హం.
Gold Price: న్యూఇయర్ వేడుకల వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇక ఆక్స్‌ఫర్ట్ గోల్డ్ నివేదికగా ప్రకారం.. అమెరికా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్), జర్మనీల సంయుక్త నిల్వల కంటే కూడా భారత మహిళల వద్దే ఎక్కువ బంగారం ఉంది.
దక్షిణాది మహిళల వద్దే ఎక్కువ..
మన దేశం విషయానికి వస్తే.. మనదేశంలో ఉన్న మొత్తం బంగారంలో దక్షిణాదిలో నివసిస్తున్న మహిళల వద్దే దాదాపు 40 శాతం బంగారం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక తమిళనాడులోనే 28 శాతం బంగారం కలిగి ఉంది. దేశ జీడీపీలో 40 శాతం కవర్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో బంగారం కీలక పాత్ర పోషిస్తోంది.
మనదేశంలో ఓ మహిళ వద్ద ఎంత బంగారం ఉండొచ్చు..
ఆదాయ పన్ను చట్టాల ప్రకారం మనదేశంలో వివాహిత స్త్రీ వద్ద అరకిలో బంగారం ఉండొచ్చు. అదే పెళ్లి కాని మహిళ వద్ద పావు కిలో బంగారం ఉండొచ్చు. ఇక పురుషుల విషయానికి వస్తే.. 100 గ్రాముల బంగారం మాత్రమే ఉండాలి.