MacBook Air M2 Price
MacBook Air M2 Price : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 (MacBook Air M2 Price) డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ రూ. 1,19,900 ధరకు లాంచ్ కాగా రూ.41,900 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. తద్వారా ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ రూ. 78వేల లోపు ధరకు లభిస్తోంది.
ఈ కొత్త మ్యాక్‌బుక్ ఆకట్టుకునే ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ సహా మరిన్నింటితో వస్తుంది. ఆపిల్ సిగ్నేచర్ M2 చిప్ కలిగి ఉంది. రూ. 78వేల లోపు ధరకే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M2 దాదాపు రూ.77,900 తగ్గింపు ధరతో వస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో వినియోగదారులు అదనంగా రూ.1,000 తగ్గింపును కూడా పొందవచ్చు. తద్వారా రూ.3,781 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ, ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ఈ డీల్ 16GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌పై మాత్రమేనని గమనించాలి.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్ బాడీ, 13.6-అంగుళాల రెటినా డిస్‌ప్లే, 60Hz కలిగి ఉంది. హుడ్ కింద, ల్యాప్‌టాప్ 8GB ర్యామ్, 512GB వరకు SSDతో కూడిన ఆపిల్ M2 2వ జనరేషన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్, ఇంటర్నల్ వెబ్ కెమెరా, ఇంటర్నల్ మైక్రోఫోన్‌ల వంటి ఫీచర్లను అందిస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్ Wi-Fi 6 (802.11 a/b/g/n/ac/ax)కు సపోర్టు ఇస్తుంది. ఈ రెండు థండర్‌బోల్ట్ 4 (Type C) పోర్ట్‌లు, హెడ్‌ఫోన్, మైక్ కాంబో జాక్‌ను కలిగి ఉంది. హై క్వాలిటీ స్టీరియో స్పీకర్లు, అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ మిడ్‌నైట్, సిల్వర్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్ గోల్డ్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది.