iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 19,901 తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!
iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025 సందర్భంగా ఐఫోన్ 16పై రూ.20వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఐఫోన్ తక్కువ ధరకు ఎలా పొందాలంటే?

iPhone 16 Price
iPhone 16 Price : కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే ఆపిల్ ఐఫోన్ 16 కొనేసుకోవచ్చు. జూలై 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2025 (Greatest of All Time) ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్లపై (iPhone 16 Price) భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 16 కూడా రూ. 19,901 తగ్గింపు ధరకే లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోం అప్లియన్సెస్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. HDFC బ్యాంక్, ఇతర ఎంపిక చేసిన కార్డులపై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16పై బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025 సమయంలో కేవలం రూ.59,999కే ఐఫోన్ 16 సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,900కి లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.19,901 తగ్గింపుతో ఈ ఐఫోన్‌ను రూ.59,999కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత ఫోన్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ. 10వేల వరకు ఉంటే.. ఐఫోన్ 16 ధరను మరింత తగ్గించవచ్చు. ఈ సేల్ సమయంలో నో-కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈఎంఐ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు.
ఐఫోన్ 16 పవర్‌ఫుల్ ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16లో కొత్త డిజైన్, టైటానియం ఫ్రేమ్, ఫ్లాట్ ఎడ్జ్ ఉన్నాయి. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో వస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆపిల్ లేటెస్ట్ A18 బయోనిక్ చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి టాస్కులను వేగంగా పూర్తి చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఐఫోన్ ఇప్పుడు 4K సినిమాటిక్ మోడ్, స్మార్ట్ HDR 5, డీప్ ఫ్యూజన్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోలు, వీడియోలను అద్భుతంగా ఉంటుంది. ఏఐ సపోర్టుతో పోర్ట్రెయిట్స్, 4K వీడియో కాలింగ్‌కు సపోర్టుతో ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.
ఐఫోన్ 16 iOS 18తో రన్ అవుతుంది. స్మార్ట్ సిరి, ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ వంటి అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఈ ఐఫోన్ యూజర్లకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐఫోన్ 16లో బ్యాటరీ గతంలో కన్నా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్, మాగ్ సేఫ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌పై రోజుంతా వస్తుంది.