Mahindra XUV300 MX2
Mahindra XUV300 MX2 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మహీంద్రా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. మీరు కాంపాక్ట్ SUV కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే.. మహీంద్రా XUV 3XO డీజిల్ వేరియంట్ MX2 అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది.
మీరు ఈ SUV కారును కేవలం (Mahindra XUV300 MX2) రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే, ఈ స్టోరీలో మీరు చెల్లించాల్సిన నెలవారీ EMI ఎంత ఉంటుంది? ఎంత ధర చెల్లించి ఈ SUV కారును కొనుగోలు చేయొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మహీంద్రా XUV 3XO ధర ఎంతంటే? :
మహీంద్రా XUV 3XO డీజిల్ వేరియంట్‌గా MX2 కారును అందిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ.8.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు ఢిల్లీలో ఈ SUV కారుని కొనుగోలు చేస్తే మీరు RTO కోసం సుమారు రూ. 78వేలు, ఇన్సూరెన్స్ కోసం రూ. 45,000 చెల్లించాలి. దాంతో మహీంద్రా XUV 3XO MX2 కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 10.18 లక్షలకు చేరుకుంటుంది.
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో EMI ఎంతంటే? :
మీరు ఈ కారు MX2 డీజిల్ వేరియంట్‌ను రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకోవచ్చు. మీరు రూ. 8.18 లక్షల బ్యాంక్ ఫైనాన్సింగ్ పొందాలి. బ్యాంక్ మీకు రూ. 8.18 లక్షల రుణాన్ని 9శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్లకు అందిస్తే మీ నెలవారీ ఈఎంఐ రూ.13,309 అవుతుంది.
కారు ధర ఎంత? :
మీరు 7 ఏళ్ల పాటు 9శాతం వడ్డీ రేటుతో రూ.8.18 లక్షలకు బ్యాంకు నుంచి కారు రుణం తీసుకుంటే.. మీరు నెలకు రూ. 13,309 EMI చెల్లించాలి. అంటే.. మీరు మహీంద్రా XUV 3XO MX2 డీజిల్ వేరియంట్ కోసం 7 ఏళ్ల పాటు సుమారు రూ. 2.99 లక్షల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఈ SUV మొత్తం ధర రూ. 13.17 లక్షలకు చేరుకుంటుంది.
ఏయే కార్లతో పోటీ అంటే? :
మహీంద్రా XUV 3XO MX2 కారును కంపెనీ 4 మీటర్ల SUVగా అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో రెనాల్ట్ కిగర్, మారుతి బ్రీజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటితో నేరుగా పోటీపడుతుంది.