Credit Card Overlimit
Credit Card Overlimit : మీకు క్రెడిట్ కార్డు ఉందా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ఆర్బీఐ క్రెడిట్ కార్డులపై బిగ్ రిలీఫ్ అందించింది. క్రెడిట్ కార్డుల ఓవర్ లిమిట్ ఫీజును నిషేధించింది. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మెట్రో నగరాలతో పాటు, టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా క్రెడిట్ కార్డులను భారీగా వినియోగిస్తున్నారు.
అయితే, చాలామంది క్రెడిట్ కార్డు యూజర్లు (Credit Card Overlimit) తమకు తెలియకుండానే కార్డు లిమిట్స్ మించిపోతున్నారు. ఫలితంగా బ్యాంకులు భారీ ఓవర్-లిమిట్ రుసుములను వసూలు చేస్తున్నాయి. పెరుగుతున్న ఫిర్యాదుల దృష్ట్యా, ఆర్బీఐ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ యూజర్లకు రిలీఫ్ కలిగించే దిశగా చర్యలు చేపట్టింది. ఇకపై క్రెడిట్ కార్డు కస్టమర్లు తమ ఖర్చులను కంట్రోల్ చేయొచ్చు.
ఓవర్‌లిమిట్ ఫెసిలిటీ క్లోజింగ్ :
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్ స్పష్టమైన అనుమతి లేకుండా ఏ బ్యాంకు లేదా కార్డ్ జారీదారుడు ఓవర్‌లిమిట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయలేరు. గతంలో చాలా బ్యాంకులు ఈ ఫీచర్‌ను ఆటోమాటిక్‌గాఎనేబుల్ చేశాయి. తద్వారా కస్టమర్లు తమ లిమిట్ మించిపోయారు. భారీ మొత్తంలో రుసుములను చెల్లించాల్సి వచ్చింది. ఆర్బీఐ ఈ పద్ధతిని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు, కస్టమర్లు ఈ ఫీచర్‌ను వారి అవసరం మేరకు యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఆర్బీఐ ప్రకారం.. కస్టమర్లు తమ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పేమెంట్ కంట్రోల్ ఫీచర్‌ను అందించాలి. కస్టమర్‌లు ఎప్పుడైనా ఓవర్‌లిమిట్ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుంది. ఖర్చుపై ఫుల్ కంట్రోల్ అందిస్తుంది.
బ్యాంకులు ఇకపై ఓవర్‌లిమిట్ ఛార్జీలు విధించవు :
కస్టమర్ ఓవర్‌లిమిట్ ఫీచర్‌కు ఎనేబుల్ చేయకుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డును లిమిట్ మించి వాడేందుకు బ్యాంక్ అనుమతించదు. సాంకేతిక కారణాల వల్ల లావాదేవీ లిమిట్ మించిపోయినప్పటికీ, బ్యాంక్ ఎలాంటి ఓవర్‌లిమిట్ ఛార్జీలను విధించదు. ఓవర్‌పెండ్ చేసే కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మీ క్రెడిట్ కార్డు మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కార్డ్ కంట్రోల్ లేదా మేనేజ్ కార్డ్ సెక్షన్ ఓపెన్ చేయండి. మీరు “ఓవర్‌లిమిట్” లేదా “లిమిట్ కంట్రోల్” అని లేబుల్ ఆప్షన్ చూస్తారు. ఇక్కడి నుంచి మీరు ఫీచర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసి వెంటనే స్టాప్ చేయొచ్చు.
ఓవర్‌లిమిట్ ఫీచర్ ఏంటో తెలుసా? :
మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1 లక్ష అనుకుందాం. ఓవర్‌లిమిట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే.. కస్టమర్ ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ఆఫ్ చేసి ఉంటే లేదా కస్టమర్ అలో చేయకపోతే ఖర్చు పరిమితిని దాటిన వెంటనే లావాదేవీ వెంటనే క్యాన్సిల్ అవుతుంది. ఒక బ్యాంకు మీ అకౌంటుపై అనుమతి లేకుండా ఓవర్‌లిమిట్ ఛార్జీ విధిస్తే కస్టమర్ ముందుగా బ్యాంకు కస్టమర్ సర్వీస్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికీ పరిష్కారం దొరకకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.