Apple iPhone 16 : భలే డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16పై భారీగా తగ్గింపు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Apple iPhone 16, iPhone 16 Sale, iPhone 16 Price, iPhone 16 Discount, ఆపిల్ ఐఫోన్ 16, ఆపిల్ ఐఫోన్ లాంచ్, ఐఫోన్ 16 మోడల్, క్రోమా ఐఫోన్ 16 మోడల్

Apple iPhone 16 : భలే డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16పై భారీగా తగ్గింపు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Apple iPhone 16

Updated On : December 3, 2025 / 3:58 PM IST

Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 ధర మరోసారి భారీగా తగ్గింది. ఈ ఆపిల్ ఐఫోన్ లాంచ్ ధర కన్నా అత్యంత చౌకగా లభిస్తోంది. 256GB వేరియంట్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ ఇటీవలే ఈ ఏడాదిలో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది.

కొత్త సిరీస్ తర్వాత ఐఫోన్ 16 మోడల్ 256GB వేరియంట్ (Apple iPhone 16) అసలు ధర కన్నా దాదాపు రూ.17,500 తక్కువకు అందుబాటులో ఉంది. అదనంగా, కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

ఐఫోన్ 16పై డిస్కౌంట్ :
ప్రస్తుతం క్రోమాలో ఐఫోన్ 16 మోడల్ 256GB వేరియంట్ రూ.76,490కు లిస్ట్ అయింది. ఆపిల్ ఫస్ట్ ఈ వేరియంట్‌ను రూ.89,900కు లాంచ్ చేసింది. ఇంకా, రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే మొత్తం రూ.17,500 సేవ్ అవుతుంది. ఈ ఐఫోన్ బ్లాక్, వైట్, రోజ్, అల్ట్రామెరైన్ టీల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు :
గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 17తో సహా అనేక ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఐఫోన్ 16 డైనమిక్ ఐలాండ్‌తో కూడిన 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఆపిల్ A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. హెక్సాకోర్ పర్ఫార్మెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మొదట iOS 18తో వచ్చింది. iOS 26కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ కూడా కలిగి ఉంది.

Read Also : PM Suraksha Bima Yojana : తక్కువ ప్రీమియంతో పీఎం సురక్ష బీమా.. జస్ట్ నెలకు రూ.2తో ఏకంగా రూ. 2 లక్షల కవరేజీ.. ఎవరు అర్హులు? బెనిఫిట్స్ ఏంటి?

ఆపిల్ ఐఫోన్ 16 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందిస్తోంది. ఆపిల్ ఈ ఐఫోన్‌లో యాక్షన్ బటన్, డెడికేటెడ్ కెమెరా బటన్‌ కూడా ఉంది. చివరగా, 25W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP68 రేటింగ్‌ కలిగి ఉంది.

ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED
ప్రాసెసర్ : A18 బయోనిక్
కెమెరా (రియర్) : 48MP (ప్రైమరీ) + 12MP (సెకండరీ)
కెమెరా (ఫ్రంట్) : 12MP
ఆపరేటింగ్ సిస్టమ్ : iOS 18 (iOS 26కి అప్‌గ్రేడ్)