MG Cars Discounts : కొత్త కారు కావాలా? ఎంజీ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 5 లక్షలపైనే తగ్గింపు.. నెవర్ బీఫోర్ ఆఫర్లు భయ్యా..!

MG Cars Discounts : కొత్త కారు కొంటున్నారా? ఎంజీ మోటార్ ఇండియా అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి కొన్ని మోడల్ కార్లపై అదనపు తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఓసారి లుక్కేయండి.

MG Cars Sale Offers

MG Cars Discounts : కొత్త కారు కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంజీ మోటార్ ఇండియా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆటోమొబైల్ మార్కెట్లో కంపెనీలైన మారుతి సుజుకీ, టాటా మోటార్స్ దిగ్గజాలకు పోటీగా ఎంజీ మోటార్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త కార్లను దించుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరగడంతో
ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ కార్లను మార్కెట్లోకి వదులుతోంది.

ముఖ్యంగా ఎస్‌యూవీ మోడళ్లపైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే హెక్టర్ లాంచ్ చేయగా బాగా పాపులర్ అయింది. విండ్సర్, కామెట్ ఈవీలతో ఎలక్ట్రిక్ కార్లలో కూడా ఎంజీ మోటార్ ఇండియా టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది.

Read Also : Big AC Discounts : కొత్త ఏసీ కావాలా? ఈ టాప్ బ్రాండ్ల ఏసీలపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రస్తుతం కంపెనీ మార్చి నెలలో స్పెషల్ డిస్కౌంట్ సేల్ ప్రవేశపెట్టింది. ఈ సేల్ సందర్భంగా కార్ల కొనుగోలుదారులు భారీగా కొనేందుకు అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి 2024, 2025 మోడల్ కార్లపైనే కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ ఎంజీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్ :
ప్రధానంగా కామెట్, ఆస్టర్, జెడ్ఎస్ ఈవీ, విండ్సర్ ఈవీ, హెక్టర్, గ్లోస్టర్‌లపై భారీ తగ్గింపుతో కార్లను కొనుగోలు చేయొచ్చు. ఎంజీ కామెట్ ఈవీ ఏకంగా రూ..45వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 2024 మోడల్‌పై మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ రూ. 20వేలు ఉండగా, కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ. 5వేలు, లాయల్టీ బోనస్ రూ. 20వేల వరకు అందిస్తోంది. 2025 కామెట్ ఈవీపై ఫాస్ట్ ఛార్జర్‌ మైక్రో ఈవీపై కూడా భారీగా డిస్కౌంట్ పొందవచ్చు.

ఎంజీ ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్ FC ట్రిమ్‌లపై రూ. 40వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఈ మోడళ్ల ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.64 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ మోడల్‌ కార్లలో బ్యాటరీని రెంట్ కోసం తీసుకోవచ్చు. మీరు ఒకవేళ (BssS) ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం రూ. 4.99 లక్షలు చెల్లించాల్సి రావచ్చు.

ఈ ఎంజీ కార్లపై అదనపు డిస్కౌంట్లు :
మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఆస్టర్ మోడల్ కూడా భారీ డిస్కౌంట్ పొందింది. 2024 ఆస్టర్ మోడళ్లపై రూ.1.45 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. టర్బో పెట్రోల్ సావీ ప్రో వేరియంట్‌ కొనుగోలుపై రూ.75వేలు నగదు తగ్గింపు, రూ.20వేలు లాయల్టీ బోనస్, రూ.35వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. రూ.15వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

2025 మోడల్‌పై గరిష్టంగా రూ. 70వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. హెక్టర్ ప్లస్, ఎంజీ హెక్టర్ మోడళ్లపై రూ. 2.20 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. డీజిల్ వేరియంట్లపై రూ.1.50 లక్షల నగదు తగ్గింపు అందిస్తోంది. 2025 మోడళ్లపై గరిష్టంగా రూ.70వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎంజీ ఆస్టర్ 2024 కార్లలో టర్బో పెట్రోల్ సావీ ప్రో వేరియంట్‌ ధర రూ. 1.45 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : iPhone 17 Series : వావ్.. వండర్‌ఫుల్.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ వచ్చేస్తోంది.. 5 బిగ్ అప్‌గ్రేడ్స్‌‌ ఇవేనట.. చివరిది గేమ్ ఛేంజర్ ఫీచర్..!

ఎంజీ గ్లోస్టర్ కార్లపై రూ. 5.50 లక్షల డిస్కౌంట్ :
రూ. 35వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.75వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.15వేలు కార్పొరేట్ డిస్కౌంట్లతో పాటు రూ. 20వేలు లాయల్టీ బోనస్ కూడా పొందవచ్చు. 2025 ఎంజీ కార్ల మోడళ్లపై రూ. 70వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఎంజీ గ్లోస్టర్‌ కార్లపై రూ. 5.50 లక్షల డిస్కౌంట్లను అందిస్తోంది.

అంతేకాదు.. రూ.4.50 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఆఫర్ చేస్తోంది. 2025 కార్ల మోడల్‌పై రూ.4 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ. 50వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, జెడ్ఎస్ ఈవీ ఎగ్జిక్యూటివ్ కార్లపై రూ. 2.05 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.