iPhone 17 Series : వావ్.. వండర్‌ఫుల్.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ వచ్చేస్తోంది.. 5 బిగ్ అప్‌గ్రేడ్స్‌‌ ఇవేనట.. చివరిది గేమ్ ఛేంజర్ ఫీచర్..!

iPhone 17 Series : ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌లో 5 భారీ అప్‌గ్రేడ్స్ అందించనుంది. ఇందులో కొత్త స్లిమ్ మోడల్ ఎంట్రీ నుంచి కెమెరా అప్‌గ్రేడ్‌ల వరకు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండనున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

iPhone 17 Series : వావ్.. వండర్‌ఫుల్.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ వచ్చేస్తోంది.. 5 బిగ్ అప్‌గ్రేడ్స్‌‌ ఇవేనట.. చివరిది గేమ్ ఛేంజర్ ఫీచర్..!

iPhone 17 Series

Updated On : March 14, 2025 / 4:13 PM IST

iPhone 17 Series Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ గత ఏడాదిలో ఐఫోన్ 16 లైనప్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఐఫోన్ 16e ఇటీవల అత్యంత సరసమైన మోడల్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ అమ్మకాలు ఇప్పటికీ డిమాండ్ కొనసాగుతోంది. రాబోయే ఐఫోన్ 17 సిరీస్ గురించి చర్చలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి.

అనేక ఏళ్లలో ఐఫోన్ లైనప్‌కు అతిపెద్ద అప్‌గ్రేడ్ గురించి చర్చలు కొనసాగుతున్నాయి. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వేరియంట్‌లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఐఫోన్ 17 ప్రో మోడళ్ల కోసం ప్రొఫెషనల్-లెవల్ కెమెరాల వరకు, డిజైన్ మార్పులు, పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లు, కొత్త ఫీచర్ల గురించి లీక్‌లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో ఎలాంటి భారీ అప్‌‌గ్రేడ్స్ ఉండనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Tech Tips in Telugu : మీ జీమెయిల్ స్టోరేజీ మళ్లీ నిండిదా? పనికిరాని ఇమెయిల్స్ బల్క్‌గా డిలీట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..!

అత్యంత సన్నని ఐఫోన్ 17 సిరీస్ :
ఈ ఏడాదిలో ఐఫోన్ సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్లలో ఒకటి కొత్త ఎయిర్ మోడల్. లీక్‌ల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌లో ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త మోడల్ ఇప్పటివరకు అత్యంత సన్నని ఐఫోన్ అని చెప్పవచ్చు.

మాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ఎయిర్ వంటి ఎకో సిస్టమ్‌లో ఇతర ఎయిర్ మోడళ్ల ఫారమ్ ఫ్యాక్టర్‌ మాదిరిగా ఉంటుంది. రుమర్ల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌లో ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ 5ఎమ్ఎమ్, 6.25mm మధ్య మందంతో వచ్చే అవకాశం ఉంది.

అద్భుతమైన డిజైన్, 6.6-అంగుళాల డిస్‌ప్లే, సింగిల్ కెమెరా లెన్స్‌ను చేర్చే సెంట్రలైజడ్ కెమెరా బంప్‌ను కలిగి ఉంటుంది. కొత్త మోడల్ లైనప్‌లో 5వ వేరియంట్‌గా ఉండదని భావిస్తున్నారు. ఐఫోన్ ప్లస్‌ను రిప్లేస్ చేస్తుందని భావిస్తున్నారు.

స్టాండర్డ్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మోడళ్ల మధ్య మిడ్-టైర్ ఆప్షన్ అందిస్తుంది. ఇతర వేరియంట్‌లతో పోలిస్తే.. ఐఫోన్ ప్లస్ మోడల్ అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల ఆపిల్ ఈ దిశగా ఆలోచిస్తుందని సమాచారం. ఐఫోన్ 17 ఎయిర్ సన్నని కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో రిప్లేస్ అవుతుందని భావిస్తున్నారు.

కొత్త A19 ప్రాసెసర్ :
ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ కూడా ఆపిల్ కొత్త A19 సిరీస్ చిప్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. టీఎస్ఎంసీ 3nm N3P ప్రాసెస్‌పై రూపొందించారు. ఈ చిప్‌తో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

120Hz డిస్‌ప్లే :
ఐఫోన్ 17 సిరీస్‌లో మరో భారీ అప్‌గ్రేడ్ రానుంది. దాదాపు అన్ని ఐఫోన్ మోడళ్లలో ప్రోమోషన్ టెక్నాలజీ ఉండనుంది. ఆపిల్ ప్రస్తుతం ప్రో మోడళ్లలో 120Hz రిఫ్రెష్ రేట్‌ను మాత్రమే అందిస్తోంది. అయితే, సాధారణ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌తో సహా కొత్త ఐఫోన్‌లు స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయని భావిస్తున్నారు.

Read Also : Big AC Discounts : కొత్త ఏసీ కావాలా? ఈ టాప్ బ్రాండ్ల ఏసీలపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

భారీ కెమెరా అప్‌గ్రేడ్ :
ఐఫోన్ 17 సిరీస్‌లో ప్రైమరీ కెమెరా అప్‌గ్రేడ్‌లు ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ట్రిపుల్ 48ఎంపీ కెమెరాలు ఉంటాయి. అందులో ప్రధానంగా వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో ఉంటాయి. ఈ మూడు కెమెరా మోడ్స్‌తో హై-రిజల్యూషన్ సెన్సార్‌ కలిగిన మొదటి ఐఫోన్‌గా చెప్పవచ్చు.

ఐఫోన్ 17 ఎయిర్ కొత్త డిజైన్‌తో 48MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుందని చెబుతున్నారు. అదనంగా, కనీసం ఒక ఐఫోన్ 17 మోడల్‌లో మెకానికల్ వేరియబుల్ ఎపర్చరు ఉంటుందని అంచనా. తద్వారా DSLR-వంటి ఫొటోగ్రఫీకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను సెట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

ఆపిల్ 5G మోడెమ్, Wi-Fi 7 :
ఐఫోన్ 17 ఎయిర్ ఆపిల్ ఇన్-హౌస్ 5G మోడెమ్‌తో రావచ్చు. స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్‌కి తగినట్టుగా ఉంటుంది. ఇతర మోడళ్లు ఇప్పటికీ క్వాల్కమ్ మోడెమ్‌లపైనే వర్క్ చేస్తాయని భావిస్తున్నారు. అదనంగా, అన్ని ఐఫోన్ 17 మోడల్‌లు ఆపిల్ కస్టమ్ వై-ఫై 7 చిప్‌తో వస్తాయి. స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.