Maruti Suzuki Fronx Launch : కొత్త కారు కొంటున్నారా? రాబోయే మారుతి SUV కారు గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి..!

Maruti Suzuki Fronx Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి సరికొత్త మోడల్ SUV కారు ఫ్రాంక్స్ (Fronx) భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది.

Maruti Suzuki Fronx _ 5 key talking points about the upcoming SUV

Maruti Suzuki Fronx Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి సరికొత్త మోడల్ SUV కారు ఫ్రాంక్స్ (Fronx) భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. మారుతి ఫ్రాంక్స్ మోడల్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV కార్ల తయారీదారులకు చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. SUV విభాగంలో 25శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది. ఈ నెల రెండో వారంలో మారుతి Fronx ధరలను ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫ్రాంక్స్ SUV కారు గురించి ఐదు కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్ :
ఫ్రాంక్స్ ఏరోడైనమిక్ సిల్హౌట్, అథ్లెటిక్, ఆధునిక డిజైన్, ఫ్రంట్, బ్యాక్ పెద్దగా ఉండనుంది. టాప్ రూఫ్, భారీ బోనెట్‌తో రానుంది. నెక్సా ‘క్రాఫ్టెడ్ ఫ్యూచరిజం’ డిజైన్ ఫిలాసఫీకి తగినట్టుగా ఫ్రాంక్స్ మోడల్ డిజైన్ ఉండనుంది.

2. అడ్వాన్స్‌డ్ నెక్స్ట్-జెన్ పవర్‌ట్రెయిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు :
ఫ్రాంక్స్ కారు (Fronx)లో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లతో 1.2-లీటర్ K12N Dual-Jet Dual-VVT ఇంజన్ ఉంది. టర్బో ఇంజిన్ 5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లతో 1.0-లీటర్ K10C టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్ రూపంలో వస్తోంది.

Read Also : Maruti Suzuki SUV Cars : మారుతి సుజుకి నుంచి రెండు కొత్త మోడల్ SUV కార్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

3. సెక్యూరిటీ ఫీచర్లు ఇవే (అంచనా) :
Fronx హార్ట్ వెన్యూపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ కారు సెక్యూరిటీ ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ ELR సీట్‌బెల్ట్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, రోల్‌ఓవర్ మిటిగేషన్‌తో ESP, EBD, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ABS, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి.

Maruti Suzuki Fronx Launch _ 5 key talking points about the upcoming SUV

4. హై ఆన్ టెక్ ఫీచర్ :
కారు లోపల టెక్నాలజీ విషయానికి వస్తే.. Fronx మోడల్ అడ్వాన్స్‌డ్ రేటింగ్ కలిగి ఉండనుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, 360-వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే కలిగి ఉండనుంది. అంతేకాదు.. ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల HD స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) కలిగి ఉంటుంది. కారు కొనుగోలుదారులు Arkamys సరౌండ్ సెన్స్ మ్యూజిక్ సిస్టమ్, సుజుకి కనెక్ట్ సిస్టమ్‌ను 40కి పైగా ఫీచర్లతో పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ యాప్, స్మార్ట్‌వాచ్, అలెక్సా కనెక్టివిటీ ద్వారా కూడా యాక్సెస్ పొందవచ్చు.

5. అద్భుతమైన మైలేజీ :
మారుతి Fronx కారు చాలా ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఇంధన సామర్థ్యం Fronx 1.0 MTకి 21.5kmpl, Fronx 1.0 ATకి 20.01kmpl, Fronx 1.2 MTకి 21.79kmpl, Fronx 1.2 AMTకి 22.89kmplగా అందిస్తుంది. SUV టర్నింగ్ రేడియస్ కూడా 4.9 మీటర్ల వద్ద బెస్ట్-ఇన్-క్లాస్ వద్ద ఉంటుందని అంచనా.

Read Also : Poco C51 Launch : అద్భుతమైన ఫీచర్లతో పోకో C51 ఫోన్ వచ్చేసింది.. ఏప్రిల్ 10 నుంచే సేల్.. ఇండియాలో ధర ఎంతంటే?