Poco C51 Launch : అద్భుతమైన ఫీచర్లతో పోకో C51 ఫోన్ వచ్చేసింది.. ఏప్రిల్ 10 నుంచే సేల్.. ఇండియాలో ధర ఎంతంటే?
Poco C51 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? షావోమీ సబ్‌బ్రాండ్ పోకో నుంచి C51 మోడల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఏప్రిల్ 10 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. పోకో C51 ఫోన్ ధర ఎంతంటే?

Poco C51, budget smartphone debuts in India, Check price, specifications
Poco C51 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ (Poco) నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. అదే.. పోకో C51 (Poco C51) బడ్జెట్ ఫోన్.. ఏప్రిల్ 7న భారత మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లేతో వచ్చింది. MediaTek Helio G36 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Poco C51 రెండు విభిన్న కలర్లలో అందుబాటులో ఉంది. 4GB RAM, 64GB స్టోరేజ్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఇన్‌బిల్ట్ RAMని 7GB వరకు విస్తరించే అవకాశం ఉంది. 8-MP డ్యూయల్ వెనుక కెమెరాలతో పెద్ద (5,000mAh) బ్యాటరీతో రన్ అవుతుంది.
పోకో C51 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో 4GB RAM, 64GB స్టోరేజీతో (Poco C51) ఏకైక వేరియంట్ ధర రూ. 8,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో త్వరలో సేల్ ప్రారంభం కానుందని తెలిపింది. ఏప్రిల్ 10 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. (Poco) స్పెషల్ లాంచ్ ధర రూ. 7,999లకే అందిస్తోంది. ఈ ప్రమోషన్ వ్యవధి ఎన్నిరోజులు ఉంటుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ (Flipkart Axis Bank Card)ల ద్వారా (Poco C51)ని కొనుగోలు చేసే కస్టమర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. అదనంగా, Poco ఫోన్ కొనుగోలుపై భారీ తగ్గింపును అందిస్తోంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 700 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డివైజ్ ప్రామాణిక EMI ఆప్షన్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. నెలకు 299గా ఉంటుంది.

Poco C51 Launch : Poco C51, budget smartphone debuts in India, Check price
Poco C51 స్పెసిఫికేషన్లు ఇవే :
పోకో C51 ఫోన్ ఆండ్రాయిడ్ 13 (Go Edition)పై రన్ అయ్యే డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. 6.52-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్ప్లేతో పాటు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 nits ప్రకాశంతో కలిగి ఉంది. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకు అనుగుణంగా స్క్రీన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ని కలిగి ఉంది. పోకో డివైజ్ 4GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio G36 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 3GB స్టోరేజీ కలిగిన ఇంటర్నల్ RAM సామర్థ్యాన్ని 7GB వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు.
కెమెరా పరంగా చూస్తే.. పోకో C51 ఫోన్ 8-MP ప్రైమరీ సెన్సార్, సెకండరీ డెప్త్ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్లతో ఫ్రంట్ సైడ్ 5-MP సెన్సార్‌తో వస్తుంది. ఈ డివైజ్ మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు విస్తరించుకోవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది.
Poco C51 ఫోన్ 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, Glonass, Beidou, మైక్రో-USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌తో సహా అనేక రకాల కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఈ డివైజ్‌లో యాక్సిలరోమీటర్, సేఫ్ అథెంటికేషన్ కోసం వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంతేకాదు.. 5,000mAh బ్యాటరీతో పాటు 76.75×164.9×9.09mm, బరువు 192 గ్రాములు వరకు ఉంటుంది.