Maruti Suzuki Jimny running out of steam_ SUV already has Rs 1 lakh discount
Maruti Suzuki Jimny : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఇటీవల లాంచ్ చేసిన 5 డోర్ల జిమ్నీపై ఇప్పటికే రూ. 1 లక్ష వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ SUV కారు మోడల్ కేవలం 4 నెలల క్రితం జూన్‌లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మారుతి సుజుకి నెక్సా ఛానెల్ (Nexa Models) నుంచి విక్రయిస్తోంది.
ప్రముఖ మహీంద్రా థార్‌కు (Mahindra Thar SUV Price) ప్రత్యర్థిగా మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny Price) జూన్ నుంచి మారుతి జిమ్నీ 12,604 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో మహీంద్రా 20,532 యూనిట్ల థార్‌లను పంపింది. థార్ 5,100 యూనిట్లతో పోల్చితే.. జిమ్నీ నెలవారీ వాల్యూమ్‌లలో దాదాపు 3,100 యూనిట్లను కలిగి ఉంది. జిమ్నీ ఎంట్రీ-లెవల్ జీటా, టాప్-స్పెక్ ఆల్ఫా అనే 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
Read Also : iQoo 12 Series Launch : నవంబర్ 7న ఐక్యూ 12 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
మారుతి డీలర్‌షిప్ వర్గాల ప్రకారం.. (Zeta) వేరియంట్‌పై రూ. 50వేల ముందస్తు తగ్గింపు, రూ. 50వేల లాయల్టీ బోనస్ ఉన్నాయి. ఇప్పటికే మారుతీ కారును కలిగిన కస్టమర్లు లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. జిమ్నీ నడిబొడ్డున K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 105PS శక్తిని 134Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT ఉన్నాయి. లాడర్ ఫ్రేమ్ చాసెస్ ఆధారంగా SUV లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్) ప్రమాణంగా ALLGRIP PRO 4WD టెక్నాలజీని కలిగి ఉంది. వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి జిమ్నీ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింద విధంగా ఉన్నాయి.
Maruti Suzuki Jimny
* జీటా MT – రూ. 12.74 లక్షలు
* జీటా ఏటీ – రూ. 13.94 లక్షలు
* ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
* ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
* ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
* ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు
మారుతి ఇటీవల లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు 5 డోర్ల జిమ్నీని ఎగుమతి చేయడం ప్రారంభించింది. SUV కార్‌మేకర్ గురుగ్రామ్ ఫెసిలిటీలో తయారైంది.