Maruti Suzuki Discounts
Maruti Suzuki Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్లు.. ఆటో దిగ్గజ కంపెనీల్లో ఒకటైన మారుతి సుజుకి అరీనా నెక్సా లైనప్‌లలో నవంబర్ 2025 లేటెస్ట్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్ డిమాండ్ మరింత పెంచేందుకు ఫ్రాంక్స్, బాలెనో, గ్రాండ్ విటారా, ఇగ్నిస్, స్విఫ్ట్ మరిన్ని మోడళ్లపై క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తోంది.
మీరు మారుతి సుజుకి కారు కొనేందుకు (Maruti Suzuki Discounts) చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. నవంబర్ 2025లో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అరీనా నెక్సా డీలర్‌షిప్‌లలో కొత్త రౌండ్ బెనిఫిట్స్ అందిస్తోంది. భారీగా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అనేక పాపులర్ మోడళ్లపై స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ కూడా అందిస్తోంది.
మారుతి సుజుకి అరీనా ఆఫర్లు :
అరీనా లైనప్‌లో ఎంట్రీ లెవల్ ఆల్టో K10, S-ప్రెస్సో సెలెరియోలు రూ. 15వేలు క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 2,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 15వేలు విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, వ్యాగన్ ఆర్‌పై కొంచెం ఎక్కువ రూ. 20వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, స్విఫ్ట్ LXi CNG ట్రిమ్‌లపై రూ. 10వేలు తగ్గింపు, ఇతర వేరియంట్లపై రూ. 15వేలు తగ్గింపు అందిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు రూ. 5వేలు కార్పొరేట్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
ఈకో రేంజ్ విషయానికి వస్తే.. రూ. 10వేల క్యాష్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌తో వస్తుంది. డిజైర్ సెడాన్ రూ. 2,500 కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే అందిస్తుంది. బ్రెజ్జా పెట్రోల్ రూ. 5,000 కార్పొరేట్ రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అయితే, ఎర్టిగా మోడల్ మాత్రం ఈ నెలలో ఎలాంటి డిస్కౌంట్లు అందించలేదు. మారుతి సుజుకి 15 ఏళ్ల కారులో ట్రేడ్ చేస్తే.. అరీనా మోడళ్లపై (డిజైర్ ఎర్టిగా మినహా) అదనంగా రూ. 25వేలు స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.
మారుతి సుజుకి నెక్సా ఆఫర్లు :
నెక్సా షోరూమ్‌లలో కూడా డిస్కౌంట్లు అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇగ్నిస్ మాన్యువల్‌పై రూ. 25వేలు తగ్గింపు, AMT వేరియంట్‌పై రూ. 30వేల తగ్గింపుతో పాటు రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 30వేలు స్క్రాపేజ్ బెనిఫిట్స్ లభిస్తుంది. బాలెనో మాన్యువల్ వెర్షన్‌లపై రూ. 15వేల తగ్గింపు, AMTపై రూ. 20వేల తగ్గింపుతో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ స్కీమ్ కింద రూ. 25వేల వరకు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్రాంక్స్ ఆఫర్లు ఇంజిన్ బట్టి మారుతూ ఉంటాయి. నాన్-టర్బో వెర్షన్లు రూ. 10వేల క్యాష్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌తో వస్తాయి. అయితే, టర్బో వేరియంట్లకు రూ. 50వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. జిమ్నీ రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ ఆల్ఫా ట్రిమ్‌పై రూ. 25వేలు అదనపు క్యాష్‌తో కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది. మారుతి సుజుకి XL6 జీటా వేరియంట్ రూ. 10వేల క్యాష్‌తో పాటు రూ. 25వేలు బెనిఫిట్స్ అందిస్తుంది.
గ్రాండ్ విటారా రూ. 40,000 వరకు క్యాష్, రూ. 40వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్‌లపై 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ రూ. 60వేలు తగ్గింపు పొందవచ్చు. 5 ఏళ్ల వారంటీతో అదనపు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇన్విక్టో ఆల్ఫా రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.1.15 లక్షల స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తుంది.