Voltas 1.5 Ton Split AC : ఈ సమ్మర్‌లో కొత్త AC కావాలా..? వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీపై భారీ డిస్కౌంట్.. సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Voltas 1.5 Ton Split AC : వోల్టాస్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ ధర భారీగా తగ్గింది. ఈ ఏసీని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Voltas 1.5 Ton Split AC ( Illustration generated using AI )

  • భారీగా తగ్గిన వోల్టాస్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ ధర
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు
  • 1.5-టన్ స్ప్లిట్ ఏసీ రూ. 31,490 ధరకు లభిస్తోంది

Voltas 1.5 Ton Split AC : అసలే సమ్మర్ సీజన్.. ఎండలు మండిపోతున్నాయి. కొత్త ఏసీ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుత అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వోల్టాస్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ సగం కన్నా తక్కువ ధరకే లభ్యమవుతోంది.

ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వోల్టాస్ 1.5-టన్ ఏసీలను ప్రారంభ ధరలో సగం ధరకే అందిస్తున్నాయి. అలాగే, భారీ బ్యాంక్ (Voltas 1.5 Ton Split AC) ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. ఈ వోల్టాస్ ఏసీలు ఇన్వర్టర్ టెక్నాలజీతో రన్ అవుతాయి. సరికొత్త టెక్నాలజీ ఆధారంగా రూపొందిందింది,

1.5 టన్ స్ప్లిట్ ఎయిర్ 5 స్టార్ :
ఈ 1.5-టన్ వోల్టాస్ ఏసీ ధర రూ. 38,490గా ఉంది. అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ధర 47శాతం వరకు తగ్గింది. ఈ స్ప్లిట్ ఏసీపై రూ. 1,750 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ ఫీచర్లలో ఆటో-రీస్టార్ట్, డీహ్యూమిడిఫైయర్ స్లీప్ మోడ్ ఉన్నాయి.

Read Also : Samsung One UI 9 Beta : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. వన్ యూఐ 9 బీటా రిలీజ్.. మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేశారా?

వోల్టాస్ 2025 స్ప్లిట్ ఎయిర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం జరుగుతున్న సేల్‌లో ఈ వోల్టాస్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ రూ. 31,490 ధరకు లభిస్తోంది. ఈ ధర 46శాతం తగ్గింది. అదనంగా, రూ. 3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ 2025 ఏసీ 3-స్టార్ రేటింగ్ 4-ఇన్-1 అడ్జస్టబుల్ మోడ్‌లతో వస్తుంది. పవర్ ఆదా చేస్తుంది. యాంటీ-డస్ట్, యాంటీ-మైక్రోబియల్ కోటింగ్‌ అందిస్తుంది.

వోల్టాస్ 1.5 టన్ 2026 :
ఈ కొత్త వోల్టాస్ మోడల్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. ఈ ఏసీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 33,990కే కొనుగోలు చేయవచ్చు. 44శాతం ధర తగ్గింపు పొందవచ్చు. ఈ ఏసీ స్ప్లిట్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. సమ్మర్ సేల్ సమయంలో ఈ ఏసీ కొనుగోళ్లపై మీకు రూ. 3,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ :
ఈ వోల్టాస్ ఏసీ రూ. 38,990 ధరకే లభిస్తుంది. ధరపై 44శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ వోల్టాస్ ఏసీ రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఏసీని కేవలం రూ. 34,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఏసీ 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో పాటు యాంటీ-డస్ట్ ఫిల్టర్, యాంటీ-మైక్రోబియల్ కోటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.