Samsung One UI 9 Beta : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. వన్ యూఐ 9 బీటా రిలీజ్.. మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేశారా?
Samsung One UI 9 Beta : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం వన్ యూఐ 9 బీటా అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 17 ఆధారితమైన ఈ అప్డేట్.. కస్టమైజేషన్, యాక్సెసిబిలిటీ, ఏఐ ఫీచర్లు, సేఫ్టీని అందిస్తుంది.
Samsung One UI 9 Beta
- శాంసంగ్ ఫోన్ల కోసం వన్ యూఐ 9 బీటా వెర్షన్ రిలీజ్
- ఈ బీటా వెర్షన్ ఎలా డౌన్ లోడ్ చేయాలంటే?
- సపోర్టు చేసే శాంసంగ్ ఫోన్లు ఏంటి? కొత్త ఫీచర్లు ఇవే
Samsung One UI 9 Beta : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పాత ఫ్లాగ్షిప్ ఫోన్ల కోసం స్టేబుల్ వన్ యూఐ 8.5 రిలీజ్ చేసిన వెంటనే శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం వన్ యూఐ 9 బీటా అప్డేట్ను అధికారికంగా రిలీజ్ చేసింది.
ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన ఈ లేటెస్ట్ బీటా అప్డేట్.. కస్టమైజేషన్, యాక్సెసిబిలిటీ, ఏఐ ఆధారిత ఫీచర్లు, సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం అనేక మార్పులను తీసుకువచ్చింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ప్రకారం.. వన్ యూఐ 9 బీటా ప్రోగ్రామ్ ఈ వారం భారత్ సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి రానుంది.
వన్ యూఐ 9లో కొత్త ఫీచర్లు ఏంటి? :
శాంసంగ్ కొత్త ఇంటర్ఫేస్ను పూర్తిగా వ్యూతో కనిపించే వన్ యూఐ 9తో రాబోయే అనేక కీలక మార్పులను సంస్థ వెల్లడించింది.
ఫస్ట్-పార్టీ యాప్‌లకు కొత్త క్రియేటివీ ఫీచర్లు :
శాంసంగ్ నోట్స్ యాప్‌లో ఇప్పుడు డెకరేటివ్ టేపులు, పెన్-స్టైల్ రైటింగ్ ఆప్షన్లతో సహా మరిన్ని క్రియేటివ్ టూల్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. అదే సమయంలో, కాంటాక్ట్స్ యాప్ ఇప్పుడు క్రియేటివ్ స్టూడియోకి డైరెక్ట్ యాక్సెస్‌ను అందిస్తోంది. అందుకే యాప్‌ల మధ్య స్విచ్ కాకుండానే ప్రొఫైల్ కార్డ్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు.
రీడిజైన్ క్విక్ సెట్టింగ్ ప్యానెల్ :
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ క్విక్ సెట్టింగ్స్ లేఅవుట్లో మరోసారి మార్పులు చేసింది. శాంసంగ్ ప్రకారం.. స్క్రీన్‌పై కంట్రోల్స్ ఎలా కనిపించాలనే విషయంలో యూజర్లకు ఇప్పుడు మరింత యాక్సస్ లభిస్తుంది. ‘బ్రైట్నెస్, సౌండ్ మీడియా ప్లేయర్లను విడివిడిగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మరిన్ని సైజ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ చెబుతోంది.
యాక్సస్ అప్‌గ్రేడ్స్ :
ఈ అప్డేట్ అనేది కర్సర్ మూమెంట్ కోసం మౌస్ కీ కంట్రోలింగ్, గూగుల్, శాంసంగ్ యాక్సెసిబిలిటీ టూల్స్ అప్‌గ్రేడ్ చేసే టాక్‌బ్యాక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. అంతేకాదు.. ఈజీగా చదివేందుకు ఎంచుకున్న టెక్స్ట్‌ను ఫ్లోటింగ్ విండోలో కొత్త ‘టెక్స్ట్ స్పాట్లైట్’ ఫీచర్‌ను కూడా శాంసంగ్ ప్రవేశపెట్టింది.
స్మార్ట్‌గా సేఫ్టీ ఫీచర్లు :
వన్ యూఐ 9 ఇప్పుడు డేంజరస్ అప్లికేషన్లను ఈజీగా పసిగట్టగలదని శాంసంగ్ చెబుతోంది. హై రిస్క్ ఉన్న యాప్‌లను గుర్తించి ఈ సాఫ్ట్వేర్ వాటిని ఆటోమేటిక్‌గా డిసేబుల్ చేస్తుంది. ఆపై అన్ఇన్స్టాల్ చేయమని యూజర్లకు అలర్ట్ చేస్తుంది.
వన్ యూఐ 9 స్టేబుల్ వెర్షన్లో జెమిని ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్‌తో సహా అనేక ఆండ్రాయిడ్ 17 ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులు వాయిస్ కమాండ్లను ఉపయోగించి డివైజ్ పార్టులను కంట్రోల్ చేయొచ్చు.
వన్ యూఐ 9 బీటా లభ్యత :
ఈసారి శాంసంగ్ వన్ యూఐ 9 బీటాను అనేక దేశాల్లో దశలవారీగా రిలీజ్ చేస్తోంది. భారత్, జర్మనీ, కొరియా, పోలాండ్, యూకే, యూఎస్‌లలోని గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్ గెలాక్సీ S26 అల్ట్రా యూజర్లు శాంసంగ్ మెంబర్స్ యాప్ ద్వారా బీటా ప్రోగ్రామ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చని ఈ టెక్ దిగ్గజం ధృవీకరించింది.
అర్హులైన యూజర్లు ఈ వారం నుంచి రెగ్యులర్ అప్డేట్ పొందవచ్చు. ఈ ఏడాది జూలైలో లాంచ్ కానున్న గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8 ఫోల్డబుల్స్‌తో పాటు శాంసంగ్ వన్ UI 9 స్టేబుల్ వెర్షన్ కూడా అందించే అవకాశం ఉంది.
