Mi Band 8 Launch : ఏప్రిల్ 18న షావోమీ MI బ్యాండ్ 8, షావోమీ 13 Ultra ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

Mi Band 8 Launch : ఏప్రిల్ 18న షావోమీ ఫ్లాగ్‌షిప్ డివైజ్ షావోమీ 13 అల్ట్రా (Xiaomi 13 Ultra) స్మార్ట్‌ఫోన్‌తో పాటు MI బ్యాండ్ 8 (MI Band 8) ఫిట్‌నెస్ ట్రాకర్ వచ్చేస్తోంది. ఏ మోడల్ ధర ఎంతంటే?

Mi Band 8 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ (Xiaomi 13 Ultra)తో పాటు Mi బ్యాండ్ 8 (Mi Band 8) ఫిట్‌నెస్ ట్రాకర్‌ను ఏప్రిల్ 18న లాంచ్ చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఫిట్‌నెస్ ట్రాకర్‌తో పాటు అదే తేదీన స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో సోనీ సెన్సార్‌లతో కూడిన స్పెషల్ లైకా-బ్రాండెడ్ కెమెరాలు ఉంటాయి.

ఇంతలో, Mi బ్యాండ్ 8 ట్రాకర్ ముందున్న Mi Band 7తో పోలిస్తే.. కొత్త డిజైన్ మెరుగైన ఫంక్షన్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫిట్‌నెస్ ట్రాకర్ల విషయానికి వస్తే.. Mi బ్యాండ్‌లకు అద్భుతమైన స్పెషిఫికేషన్లతో అనేక సరసమైన స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : iPhone 13 Flipkart Offer : బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి!

షావోమీ చైనా వెబ్‌సైట్‌లోని ఫొటోల ప్రకారం, Mi బ్యాండ్ 8 AMOLED డిస్‌ప్లేతో పిల్ ఆకారపు డయల్‌ను కలిగి ఉంటుంది. ర్యాప్-అరౌండ్ బ్యాండ్‌లకు బదులుగా.. బెల్ట్ రెండు వైపులా ధరించేలా ఉంటుంది. షావోమీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, (Lei Jun Weibo) అకౌంట్లో Mi బ్యాండ్ 8 నెక్లెస్‌గా కూడా ధరించవచ్చని ధృవీకరించారు. వాస్తవానికి, డివైజ్ థ్రెడ్‌పై లాకెట్టులా బ్యాండ్ కనిపిస్తుంది.

Mi Band 8 రోజంతా హృదయ స్పందన ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్, తక్కువ SpO2 వంటి కొన్ని ప్రాథమిక ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త బ్యాండ్ మోడల్ కనెక్ట్ చేసిన ఫోన్ ద్వారా GPS కనెక్టివిటీని అందిస్తుంది. అయితే, ప్రో మోడల్‌లో ఇంటర్నల్ GPS ఉండొచ్చు.

Mi Band 8 to launch on April 18 along with Xiaomi 13 Ultra

Mi బ్యాండ్ 7 (NFC) వేరియంట్ ప్రస్తుతం చైనాలో 299 యువాన్లకు (సుమారు రూ. 3500) విక్రయిస్తోంది. NFC యేతర బ్యాండ్ 7 మోడల్ 249 యువాన్లకు (సుమారు రూ. 2900) లాంచ్ అయింది. ఈ డివైజ్ భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. ఫీచర్ల విషయానికొస్తే.. షావోమీ బ్యాండ్ 7 మోడల్ 192 x 490 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.62-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిట్‌నెస్ బ్యాండ్ పిక్సెల్ డెన్సిటీ 326PPI, 500నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా ఫీచర్‌ను కలిగి ఉంది. బ్యాండ్ Xiao AI అసిస్టెంట్‌తో వచ్చింది. 120 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో 4 ప్రొఫెషనల్ మోడ్‌లు కూడా ఉన్నాయి. Mi బ్యాండ్ డజను హెల్త్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో రోజంతా బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకర్, REMతో కూడిన స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్, ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్, PAI వంటి మరిన్నో ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Skoda SUV Models : స్కోడా నుంచి రెండు సరికొత్త మోడల్ కార్లు.. అద్భుతమైన ఫీచర్లు, కొత్త ఎడిషన్ల ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు