Microsoft CEO Satya Nadella : సరికొత్త ’బింగ్’.. గూగుల్‌తో డ్యాన్స్ చేయిస్తుందని ఆశిస్తున్నా.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

నాదెళ్ల మాట్లాడుతూ.. గ్లోబల్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే గూగుల్‌తో మైక్రోసాప్ట్ సరికొత్తగా తీసుకొచ్చిన సెర్చ్ ఇంజిన్ బింగ్ పోటీని ఇస్తుందని అన్నారు. నేను 20ఏళ్లుగా గూగుల్‌తో పోటీ పడేందుకు ఎదురు చూస్తున్నానని, మైక్రోసాప్ట్ తాజా ఆవిష్కరణలో ఆ పోటీ వచ్చిందని ఆశిస్తున్నానని నాదెళ్ల చెప్పుకొచ్చారు.

Microsoft's CEO

Microsoft CEO Satya Nadella : ఓపెన్ ఏఐ సహకారంతో మైక్రోసాప్ట్ పునరుద్దరించిన సరికొత్త సర్చ్ ఇంజిన్ బింగ్ ఎంట్రీతో టెక్ దిగ్గజాల మధ్య పోటీ మరింత వేడెక్కిన విషయం తెలిసింది. తాజాగా ఏఐ- పవర్డ్ సహకారంతో మైక్రోసాప్ట్ సరికొత్త బింగ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ‘ది వెర్జ్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గూగుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరికొత్త సెర్చ్ ఇంజిన్ బింగ్‌తో గూగుల్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారు బయటకు వచ్చి ఒత్తిడితో డ్యాన్స్ చేసేలా బింగ్ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Microsoft: అనేక దేశాల్లో నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు.. సమస్య పరిష్కరిస్తున్నామన్న సంస్థ

గూగుల్‌తో మేము ఒత్తిడితో కూడిన డ్యాన్స్ చేయిస్తున్నామని ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానని, అది గొప్ప రోజు అవుతుందని నేను భావిస్తున్నానని నాదెళ్ల వ్యాఖ్యానించారు. కొత్త బింగ్ ఓపెన్ ఏఐ యొక్క వైరల్ ఏఐ చాట్‌బాట్, చాట్ జీపీటీ కంటే మరింత శక్తివంతమైనదని, శోధనకోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని మైక్రోసాప్ట్ తెలిపింది. వేగవంతమైన, ఖచ్చితమైన సమాచారంతో మరింత సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొంది.

 

ఇదే విషయంపై నాదెళ్ల మాట్లాడుతూ.. గ్లోబల్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే గూగుల్‌తో మైక్రోసాప్ట్ సరికొత్తగా తీసుకొచ్చిన సెర్చ్ ఇంజిన్ బింగ్ పోటీని ఇస్తుందని అన్నారు. నేను 20ఏళ్లుగా గూగుల్‌తో పోటీ పడేందుకు ఎదురు చూస్తున్నానని, మైక్రోసాప్ట్ తాజా ఆవిష్కరణలో ఆ పోటీ వచ్చిందని ఆశిస్తున్నానని నాదెళ్ల చెప్పుకొచ్చారు.