Microsoft: అనేక దేశాల్లో నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు.. సమస్య పరిష్కరిస్తున్నామన్న సంస్థ

మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365, అజ్యూర్ వంటి సేవలు బుధవారం నుంచి పలు దేశాల్లో నిలిచిపోయాయి. ఈ అంశంపై వేలాది మంది వినియోగదారులు కంపెనీకి ఫిర్యాదు చేశారు. దీంతో మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.

Microsoft: అనేక దేశాల్లో నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు.. సమస్య పరిష్కరిస్తున్నామన్న సంస్థ

Microsoft: ఇండియాతోపాటు అనేక దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365, అజ్యూర్ వంటి సేవలు బుధవారం నుంచి పలు దేశాల్లో నిలిచిపోయాయి. ఈ అంశంపై వేలాది మంది వినియోగదారులు కంపెనీకి ఫిర్యాదు చేశారు.

Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి పవన్ కల్యాణ్… ‘వారాహి’కి వాహన పూజ చేయించిన జనసేనాని

దీంతో మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. పొటెన్షియల్ నెట్‌వర్క్ సమస్యను గుర్తించినట్లు, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే, సమస్య తలెత్తడానికి గల కారణాల్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. బుధవారం ఉదయం నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. ఎంతమంది వినియోగదారులపై ఈ ప్రభావం ఉందనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించే ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ సంస్థ దీనికి సంబంధించి కొన్ని వివరాల్ని వెల్లడించింది.

Gujarat: గుజరాత్‌లో ఢిల్లీ తరహా ఘటన.. యువకుడిని ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. యువకుడు మృతి

దాదాపు 3,700 మందికిపైగా యూజర్లు మైక్రోసాఫ్ట్ 365 పని చేయడం లేదని కంపెనీకి రిపోర్టు చేసినట్లు తెలిపింది. ఇక మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోవడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మీమ్స్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మందికిపైగా యూజర్లు వాడుతున్నారు. ప్రస్తుతం వీరిలో ఎక్కువ సంఖ్యలోనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇండియాతోపాటు జపాన్, యూఏఈ, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో సమస్య తలెత్తింది.