Gujarat: గుజరాత్‌లో ఢిల్లీ తరహా ఘటన.. యువకుడిని ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. యువకుడు మృతి

ఈ ఘటన గుజరాత్, సూరత్ జిల్లాలో ఈ నెల 18న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్వినిబెన్‌తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది.

Gujarat: గుజరాత్‌లో ఢిల్లీ తరహా ఘటన.. యువకుడిని ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. యువకుడు మృతి

Gujarat: ఢిల్లీలో ఇటీవల అంజలి సింగ్ అనే యువతిని కారు ఢీకొని లాక్కెళ్లిన తరహాలోనే గుజరాత్‌లో మరో ఘటన జరిగింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో, అతడు కారు కింద చిక్కుకున్నాడు. అయినప్పటికీ కారు ఆగకుండా వెళ్లడంతో అతడు మరణించాడు.

Pawan Kalyan : నాటు నాటు ఆస్కార్ గెలవాలి.. పవన్ కళ్యాణ్!

ఈ ఘటన గుజరాత్, సూరత్ జిల్లాలో ఈ నెల 18న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్వినిబెన్‌తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది. ఈ ఘటనలో అశ్వినిబెన్ రోడ్డుపై దూరంగా పడిపోయింది. బైక్ కూడా కొద్ది దూరంలో కనిపించింది. కానీ, బైక్ నడుపుతున్న సాగర్ పాటిల్ మాత్రం కనిపించలేదు. అతడు కారు కింద చిక్కుకున్నాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా అలాగే డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. అలా కారు అతడిని 12 కిలోమీటర్లు లాక్కెళ్లింది. దీంతో కారు కింద చిక్కుకున్న సాగర్ గాయాలతో మరణించాడు.

AP BJP On Pawan Kalyan : పవన్ కల్యాణ్ పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ.. నేతల తలో మాట

అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ అశ్వినిని అప్పటికే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనను ఒక వ్యక్తి వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే కారు డ్రైవ్ చేసిన నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలోని కాంఝావాలా ప్రాంతంలో కూడా ఇదే తరహాలో అంజలి సింగ్ అనే యువతి మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి.