Money Saving Tips : కొత్తగా ఉద్యోగంలో చేరారా? మీ జీతం ఎంత ఉన్నా సరే.. ఇలా బడ్జెట్ వేస్తే.. మీ జీవితంలో డబ్బుకు కొరత ఉండదు!

Money Saving Tips : కొత్తగా ఉద్యోగంలో చేరారా? భవిష్యత్తులో ఆర్థికపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రూల్ పాటిస్తే.. డబ్బు పరంగా ఎలాంటి డోకా ఉండదు.

Money Saving Tips

Money Saving Tips : కొత్తగా ఉద్యోగంలో చేరారా? భవిష్యత్తు గురించి ముందుగానే ఒక ప్లానింగ్ ఉండాలి. సాధారణంగా  డబ్బు ఆదా చేయడం అనేది ఒక ఆర్ట్.. డబ్బును అందరూ సంపాదిస్తారు. కొద్దిమంది మాత్రమే డబ్బును ఆదా చేయగలరు.

మరికొంతమంది ఇష్టమొచ్చినట్టు నీళ్లలా ఖర్చు పెట్టేస్తుంటారు. వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేయడమే పనిగా పెట్టుకుంటారు. మరికొంతమంది ఆ వచ్చిన డబ్బును ఆదా చేయాలని అనుకుంటారు కానీ, ఆదా చేయలేరు.

Read Also : Digital Gold : డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టడం ఎలా? కలిగే లాభాలేంటి? ఫిజికల్ గోల్డ్ కన్నా ఎంతవరకు సేఫ్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

మీ జీతం ఎంత తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా ఈ రూల్స్ మాత్రం తప్పక పాటించండి. మీ ఇంటి బడ్జెట్‌ను సరైన పద్ధతిలో వేసుకుంటే.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు.

మీబడ్జెట్‌ ఇలా ఉందా? :
బడ్జెట్ విషయంలో మీరు ఈ రూల్ పాటిస్తే.. భవిష్యత్తులో డబ్బు పరంగా ఎలాంటి కొరత ఉండదు. మీకు వచ్చే ఆదాయంలో 50 శాతం ఇంటి ఖర్చుల కోసం పక్కన పెట్టుకోండి. మిగిలిన 50 శాతాన్ని మీరు సేవింగ్స్ చేసుకోండి. ఇందులో 30 శాతం మీ ఫ్యామిలీతో కలిసి ఏదైనా సరదాగా గడిపేందుకు ఖర్చు చేయవచ్చు.

ఉదాహరణకు.. సినిమాలు, ప్రయాణాలు, షాపింగ్‌ వంటివి అనమాట. మిగిలిన 20శాతం ఎంత ఖర్చయినా ఆదా చేయండి. దానిపైనే పెట్టుబడి పెట్టండి చాలు. మీ ఆదాయంలో కనీసం 20శాతమైనా సేవింగ్ చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి.

ఉదాహరణకు.. మీ బడ్జెట్ ఎలా ఉండాలంటే?
మీరు ప్రతి నెలా రూ. 80వేలు సంపాదిస్తే.. మీ జీతం 50-30-20 రూల్ ప్రకారం మార్చుకోండి. 80 వేలలో 50 శాతం అంటే రూ. 40 వేలు. ఈ మొత్తాన్ని అవసరమైన ఇంటి ఖర్చు కోసమే వాడాలి. 30 శాతం అంటే రూ. 24 వేలు.. మీకు ఏమైనా సరదాలు ఉంటే వాటికోసం వినియోగించుకోవచ్చు. 20 శాతం రూ. 16 వేలు.. మీరు తప్పనిసరిగా ఈ మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి.

అందులోనూ అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మరింత డబ్బును ఆదా చేయొచ్చు. కానీ, సేవింగ్స్ కోసం కనీసం 20 శాతం డబ్బును దాచుకోవాలి. మీరు ప్రతి నెలా రూ. 16వేలు ఆదా చేస్తే.. మీరు ఒక ఏడాదిలో రూ. లక్షా 92వేల వరకు సేవింగ్ చేయొచ్చు.

మీ సేవింగ్స్ ఈ మార్గాల్లో పెట్టుబడి పెట్టండి :
మీ ఆదాయంపై  పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. మీకు వచ్చే ఆదాయం బట్టి పెట్టుకోండి. మీ ఆదాయం పెరిగేకొద్దీ  అందులో 20శాతం కూడా పెరుగుతూ వస్తుంది.

అప్పుడు మీరు అనేక మార్గాల్లో పెట్టుబడులను పెట్టవచ్చు. మీరు పెట్టుబడి పెట్టడానికి SIP, PPF, FD, గోల్డ్, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Read Also : MSSC Scheme : మహిళలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మార్చి 31లోగా ఇందులో పెట్టుబడి పెట్టండి.. రెండేళ్లలో మీ డబ్బు డబుల్ అవుతుంది!

కావాలంటే.. పెన్షన్ స్కీమ్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తమ వృద్ధాప్యంలో ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు ఆదా చేసే డబ్బు మీకు కష్టకాలంలో ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు మీ సొంత ఖర్చుల కోసం ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం ఉండదు.