Digital Gold : డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టడం ఎలా? కలిగే లాభాలేంటి? ఫిజికల్ గోల్డ్ కన్నా ఎంతవరకు సేఫ్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
Digital Gold vs Physical Gold : ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ ఏది కొనుగోలు చేస్తున్నారు? ఈ రెండింటిలో ఏ బంగారంపై పెట్టుబడి పెడితే మంచిది? ఎందులో లాభాలేంటి? నష్టాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..

Digital Gold vs Physical Gold
Digital Gold vs Physical Gold : పసిడి ధరలు పైపైకి ఎగిసిపడుతున్నాయి. రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధరలు ఏకంగా 90వేల దగ్గరగా ట్రేడ్ అవుతోంది. చూస్తుంటే మరో కొద్ది రోజుల్లో లక్ష దాటినా ఆశ్చర్య పడక్కర్లేదు. మార్కెట్లో బంగారానికి ఫుల్ డిమాండ్ పెరగడంతో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
మీరు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఆగండి.. మీరు ఏ బంగారంపై పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే.. మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయో తెలుసా? ఫిజికల్ గోల్డ్ కన్నా డిజిటల్ గోల్డ్ పరంగా ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే.. లాభాలు అనేకమని చెప్పవచ్చు.
డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ తేడా ఏంటి? :
ముందుగా ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటి? డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫిజికల్ గోల్డ్ అంటే మనకు భౌతికంగా కనిపిస్తుంది. మనకు సులభంగా ధరించగలం.. ఎక్కడికైనా క్యారీ చేయగలం. కానీ, డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా కనిపించదు. కానీ, డిజిటల్ రూపంలోనే ఉంటుంది.
ఫిజికల్ గోల్డ్ అనేది బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఉంటుంది. దీన్ని కాయిన్స్, బిస్కెట్లు, బంగారం కడ్డీల రూపంలో కొనుగోలు చేయొచ్చు. 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రం ఆర్నమెంట్ బంగారంగా చెబుతారు. మార్కెట్లో దొరికే ఆభరణాలు ఎక్కువగా 22 క్యారెట్ల గోల్డ్‌తోనే తయారువుతాయి.
మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తే.. ఫిజికల్ గోల్డ్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు.. డిజిటల్ రూపంలో కూడా మీ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు అనమాట.
ఎందులో రిస్క్ ఉందంటే? :
ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ధరల పరంగా విలువ ఒకేలా ఉన్నప్పటకీ, సెక్యూరిటీ పరంగా కొన్ని చిక్కులు ఉన్నాయి. మీరు ఫిజికల్ గోల్డ్ రూపంలో పెట్టుబడి పెడితే నష్ట ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. పెద్దగా సెక్యూరిటీ ఉండదు.
ఒకవేళ మీరు ఫిజిల్ గోల్డ్ కొనుగోలు చేస్తే.. దానిపై మజూరి, జీఎస్టీ, తరుగు, తయారీ ఖర్చులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మార్కెట్ అసలు ధర కన్నా ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ మీ దగ్గరి ఫిజికల్ గోల్డ్ అమ్మాలని భావిస్తే.. మీరు అనుకున్నంతగా డబ్బలు రావు.
ఎందుకంటే.. మీరు అమ్మే బంగారం ఏ రూపంలో ఉన్నా సరే.. బంగారం కాయిన్స్, బిస్కట్లుగా ఉన్నా లేదా నగల రూపంలో ఉన్నా ఇందులో తరుగు ఎక్కువగా పోయే అవకాశం ఉంది. ఫలితంగా మీరు ఆశించిన ధర పలకదని గమనించాలి. అదే మీరు డిజిటల్ రూపంలో గోల్డ్ కొనుగోలు చేస్తే ఇందులో ఎలాంటి నష్టాలు ఉండవు. మార్కెట్ ధర ఎంత ఉంటే అంతే మొత్తంలో మీరు డబ్బులను పొందవచ్చు. అందుకే ఫిజికల్ గోల్డ్ కన్నా డిజిటల్ గోల్డ్ పెట్టుబడి అనేది అద్భుతమైనది అని చెప్పవచ్చు.
డిజిటల్ గోల్డ్‌పై ఈ మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు :
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు డిజిట్ గోల్డ్ పెట్టుబడులను చాలా సులభంగా చేయొచ్చు. మీ ఫోన్‌లో Google Pay, Paytm, Zerodha, PhonePe, Groww వంటి యాప్స్ ద్వారా ఈ డిజిటల్ గోల్డ్ పెట్టుబడులను చేయొచ్చు. మీరు ఒకసారి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేశాక అది డిజిటల్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది.
మీ వ్యాలెట్ లోనే భద్రంగా స్టోర్ అయి ఉంటుంది. మీకు కావాలని అనుకుంటే.. మీ డిజిటల్ బంగారాన్ని మీరు ఫిజికల్ రూపంలో లేదా నగదు రూపంలో లేదా కాయిన్స్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ డిజిటల్ బంగారం మినిమం అరగ్రాము వరకు ఇంటికి డోర్ డెలివరీ ద్వారా పొందవచ్చు.
డిజిటల్ గోల్డ్ పెట్టుబడితో కలిగే ప్రయోజనాలేంటి? :
- డిజిటల్ గోల్డ్ ఎప్పుడంటే అప్పుడు మీరు నగదు రూపంలోకి మార్చుకోవచ్చు.
- సెక్యూరిటీ పరంగా డిజిటల్ గోల్డ్ చాలా సేఫ్.. ఫిజిల్ గోల్డ్ మాదిరిగా దొంగల ప్రమాదం ఉండదు.
- మీ డిజిటల్ గోల్డ్ డిజిటల్ వ్యాలెట్‌లోనే స్టోర్ అవుతుంది. పైగా సెక్యూరిటీ కూడా ఉంటుంది.
- మీ దగ్గర కనీసం ఒక రూపాయి ఉన్నా కూడా సులభంగా డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టుకోవచ్చు.
- మీకు అవసరమైతే వాయిదాలా రూపంలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
- లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసేవారికి డిజిటల్ గోల్డ్ అనేది ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా డిజిటల్ రూపంలో బంగారం పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడే పెట్టుకోండి. బంగారం ధరలకు తగినట్టుగా మీ బంగారానికి ధరతో పాటు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సమయంలోనైనా సులభంగా డబ్బు రూపంలోకి మార్చుకోవచ్చు.