iPhone 16e Price : పాకిస్తాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e ధర ఎంతో తెలుసా? మీరు వంద శాతం ఊహించలేరు.. నిజం తెలిస్తే షాక్ అవుతారు!
iPhone 16e Price : ఐఫోన్ 16e బేస్ వేరియంట్ ధర భారత్‌లో రూ. 59,900 ఉంటే.. పాకిస్తాన్‌లో మరో ధరకు అమ్ముతున్నారు. దయాది దేశంలో ఐఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

iPhone 16e in Pakistan may surprise
iPhone 16e Price : భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రతి రంగంలోనూ భారత్‌తో పోటీ పడటానికి ప్రయత్నిస్తోంది. కానీ, పాకిస్తాన్ భారత్ స్థాయికి చేరుకోలేకపోతోంది. రెండు దేశాల మధ్య భౌగోళికంగా అనేక సారూప్యతలు ఉన్నప్పటికీ, మార్కెట్లు, ధరలలో చాలా తేడా ఉంది.
ఇటీవలే ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో కొత్త ఐఫోన్ 16e ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆపిల్ అందించే అత్యంత చౌకైన ఫోన్ కూడా ఇదే.
మన భారత్‌లో (iPhone 16e) బేస్ వేరియంట్ ధర రూ. 59,900 మాత్రమే ఉంది. కానీ, దయాది దేశం పాకిస్తాన్‌లో మాత్రం ఊహించని ధరకు అమ్ముడవుతోంది. వాస్తవానికి, ఈ ఐఫోన్ ధర పాకిస్తాన్‌లో కొద్దిగా భిన్నంగా ఉంది.
పాకిస్తాన్‌లో రూపాయి కరెన్సీనే వాడుకలో ఉందని తెలిసిందే కదా.. ఇప్పుడు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆపిల్ ఫోన్ కొనడానికి మీరు పాకిస్తాన్‌లో ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భారత్‌లో ఐఫోన్ 16e ధర ఎంతంటే? :
ఐఫోన్ 16e మోడల్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లు (128GB, 256GB, 512GB)లో అందుబాటులో ఉంది. వీటన్నింటిలో 8GB RAM మాత్రమే ఉంది. 128GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర భారత్‌లో రూ.59,900 ఉంటే.. 256GB మోడల్ ధర రూ.69,900. అయితే 512GB మోడల్ ధర రూ. 89,900 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
పాకిస్తాన్‌లో ఐఫోన్ 16e ధర ఎంతంటే? :
పాకిస్తాన్‌లో ఐఫోన్ 16e ధర కొద్దిగా భిన్నంగా ఉంది. బేస్ వేరియంట్ కోసం దాదాపు 1,67,000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే.. భారత్ కన్నా ఐఫోన్ ధర చాలా రెట్లు ఎక్కువ. 256GB వెర్షన్ మీకు PKR 1,95,000 ఖర్చు అవుతుంది.
మీరు టాప్-టైర్ 512GB మోడల్‌ను కొనుగోలు చేస్తే.. మీరు PKR 2,51,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌లో ఐఫోన్ ధర ఇంత పెరగడానికి కారణం డాలర్‌తో పోలిస్తే.. పాకిస్తాన్ రూపాయి విలువ భారీగా పడిపోవడమే. దీని వల్ల భారత్‌లో ఐఫోన్ ధరల కన్నా చాలా ఖరీదైనదిగా మారింది.
ఇతర దేశాల్లో ఐఫోన్ 16e ధర ఎంతంటే? :
వివిధ దేశాలలో ఐఫోన్ 16e ధరలను పరిశీలిస్తే.. అమెరికాలో ఐఫోన్ 16e ప్రారంభ ధర USD 599, అంటే.. దాదాపు రూ. 52,063. దుబాయ్‌లో ఈ బేస్ మోడల్ AED 2,599 దాదాపు రూ. 61,476 కి లభ్యమవుతుంది. కెనడాలో, ఇదే ఐఫోన్ మోడల్ ధర CAD 899, అంటే దాదాపు రూ. 54,926 అనమాట.
Read Also : PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? అసలు కారణం ఇదే.. ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే?
వియత్నాంలో, బేస్ వేరియంట్ VND 16,999,000, అంటే.. దాదాపు రూ. 57,898 కి అమ్ముడవుతోంది. చివరగా, హాంకాంగ్‌లో, ఐఫోన్ 16e HKD 5,099 కి లభిస్తుంది.. అంటే దాదాపు రూ. 56,970 అనమాట.