Apple iPhone 16e : కొత్త ఐఫోన్ కావాలా? చౌకైన ఐఫోన్ 16e ప్రీ-ఆర్డర్ సేల్ మీకోసం.. అదిరిపోయే ఆఫర్లు.. డోంట్ మిస్!
Apple iPhone 16e Pre Orders : కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16e మోడల్ ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ ఫిబ్రవరి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Apple iPhone 16e pre-order
Apple iPhone 16e Pre Orders : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. అత్యంత సరసమైన ఐఫోన్ 16e మోడల్ ప్రీ-ఆర్డర్ సేల్ మొదలైంది. ఫిబ్రవరి 21న సాయంత్రం 6:30 గంటల నుంచే ప్రీఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఆపిల్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల మాదిరిగానే తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఈ ఐఫోన్ 16e ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ధరతో పాటు ప్రొటెక్షన్ ప్లాన్ల వరకు ఆపిల్ ఆఫర్ చేస్తోంది. మీరు సరికొత్త సరసమైన ఫోన్ 16e కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఫోన్ 16e మోడల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16e మోడల్ మొత్తం బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే, 128GB, 256GB, 512GB అనే మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. మీరు అధికారిక సిలికాన్ కేసును రూ. 3,900కు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కేసు వింటర్ బ్లూ, ఫుచ్సియా, లేక్ గ్రీన్, బ్లాక్, వైట్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
128GB స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 16e బేస్ వేరియంట్ ధర రూ.59,900, అయితే 256GB, 512GB వెర్షన్‌లను వరుసగా రూ.69,900, రూ.89,900కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ఫిబ్రవరి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 16e ఫోన్ 128GB, 256GB, 512GB వెర్షన్‌లకు నో కాస్ట్ ఈఎంఐ నెలకు వరుసగా రూ.2,496, రూ.2,912, రూ.3,746 నుంచి ప్రారంభమవుతుంది.
ఆపిల్ కేర్ ప్లస్ ప్లాన్‌లు :
అన్ని ఐఫోన్‌ల మాదిరిగానే (AppleCare+)ను ఫోన్‌తో లేదా మీ కొత్త ఫోన్ కొనుగోలు చేసిన రోజు నుంచి 60 రోజులలోపు కొనుగోలు చేయవచ్చు. అయితే, రెండోది మీరు కొనుగోలు చేసినట్టుగా ప్రూఫ్ కలిగి ఉండాలి. ఆపిల్ స్టోర్‌కు వెళ్లి చెకింగ్ కోసం మీ ఐఫోన్ చూపించాలి లేదా రిమోట్ డయాగ్నస్టిక్‌ను రన్ చేయాలి.
ఐఫోన్, బ్యాటరీ, కేబుల్ కోసం రీప్లేస్‌మెంట్ కవరేజ్ రెండు సంవత్సరాల రిపేరింగ్ ఆప్షన్ అందిస్తుంది. అయితే, మీరు స్క్రీన్, బ్లాక్ గ్లాస్ కోసం రూ. 2,500, ఇతర నష్టాలకు రూ. 8,900 చెల్లించాలి. ఐఫోన్ 16e మోడల్ ఆపిల్ కేర్ ప్లస్ ప్లాన్ ధర రూ. 10,900, కానీ, మీరు ఈఎంఐలను కూడా చెల్లించవచ్చు.
కొత్త ఐఫోన్ యూజర్ల కోసం ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్ ఆర్కేడ్, ఆపిల్ న్యూస్ ప్లస్, ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ మోడళ్లను 3 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. ఇండియన్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ రెడింగ్టన్, మీ క్రెడిట్ కార్డ్‌తో ఐఫోన్ 16e కొనుగోలు చేస్తే.. రూ. 4వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐలతో ఈ ఆఫర్లను అందిస్తున్నాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు రూ. 6వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌కు కూడా పొందవచ్చు.