Apple Foldable iPhones : ఆపిల్ లవర్స్‌కు కిక్కెక్కించే న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లకు దీటుగా మడతబెట్టే ఐఫోన్.. లాంచ్, డిస్‌ప్లే వివరాలు లీక్..!

Apple Foldable iPhones : కొత్త పోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌‌కు ముందుగానే మడతబెట్టే ఐఫోన్ మోడల్ గురించి అనేక లీకులు బయటకు వచ్చాయి. తాజాగా డిస్‌ప్లే, లాంచ్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Apple Foldable iPhones : ఆపిల్ లవర్స్‌కు కిక్కెక్కించే న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లకు దీటుగా మడతబెట్టే ఐఫోన్.. లాంచ్, డిస్‌ప్లే వివరాలు లీక్..!

Apple foldable iPhone's display

Updated On : February 22, 2025 / 5:35 PM IST

Apple Foldable iPhones : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే వార్త.. ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా గ్లోబల్ మార్కెట్లోకి ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది. అయితే, ఈ మడతబెట్టే ఐఫోన్ ఇంకా లాంచ్ కానేలేదు.. ఫీచర్ల వివరాలు ముందుగానే లీక్ అయ్యాయి. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ దాదాపు దశాబ్ద కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్‌పై పనిచేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ రాక గురించి అనేక నివేదికలు బయటకి వచ్చాయి.

Read Also : Post Office Scheme : భలే ఉందిగా పోస్టాఫీసు స్కీమ్.. మీరు పెట్టుబడి పెడితే చాలు.. కేవలం వడ్డీతోనే ప్రతి నెలా రూ. 10వేలు సంపాదించుకోవచ్చు..!

అయితే, గత ఏడాదిలో ఈ ఊహాజనిత నివేదికల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఐఫోన్ 18 ఫోల్డ్ పేరుతో వస్తుందని లీక్‌లు వచ్చాయి. 2026లో కొత్త మడతబెట్టే ఐఫోన్ రాబోతుందని సూచిస్తున్నాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్ కన్నా ఈ ఐఫోన్ పెద్దదిగా ఓపెన్ డిస్‌ప్లే ఉంటుందని అంటున్నారు.

వాస్తవానికి ఆపిల్ కంపెనీ రెండు ఫోల్డబుల్ డివైజ్‌లపై పనిచేస్తోంది. రెండవది ఫోల్డబుల్ ఐప్యాడ్ అంట. ఈ పుకార్లలో ఎంత వరకు వాస్తవం ఉందో లేదో తెలియదు. కానీ, లీక్‌లను విశ్వసిస్తే.. ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లే వివరాలు ఇలా ఉన్నాయి.

వీబో ఆధారిత లీక్‌స్టర్, డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన లీక్ ప్రకారం.. ఫోల్డబుల్ ఐఫోన్ మడతపెట్టినప్పుడు 5.49-అంగుళాల డిస్‌ప్లే, ఫోల్డ్ ఓపెన్ చేస్తే 7.74-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అయితే, గత వారం లాంచ్ అయిన ఒప్పో ఫైండ్ N5తో పోల్చినప్పుడు ఐఫోన్ ఫోల్డ్ డిస్‌ప్లే చిన్నదిగా, వెడల్పుగా ఉంటుందని లీక్‌స్టర్ పేర్కొంది.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా మునుపటి లీక్‌ మాదిరిగానే ఉంది. ఫోల్డబుల్ ఐఫోన్ “ఐఫోన్ 16 ప్రో మాక్స్ కన్నా పెద్దదిగా ఉండే డిస్‌ప్లే సైజుకు ఓపెన్ అవుతుంది” అని పేర్కొంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటే.. ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లే కనీసం 7-అంగుళాలు ఉంటుందని సూచిస్తుంది.

Read Also : NPS Vatsalya : మీ పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీమ్.. NPS వాత్సల్య పథకం ఏంటి? ఎలా ఓపెన్ చేయాలి? ప్రతి పేరంట్స్ తప్పక తెలుసుకోవాలి!

కొన్ని ఏళ్ల క్రితమే ఆపిల్ ఔట్ ఫోల్డ్ చేసే ఫోల్డబుల్ డిస్‌ప్లేలతో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆ తర్వాత కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తున్న చాలా ఫోల్డబుల్ ఫోన్‌ల మాదిరిగానే లోపలికి మడతపెట్టే డిజైన్‌పై దృష్టి సారించింది. అదనంగా, లీక్‌స్టర్ ఫోల్డబుల్ ఐఫోన్ ఇంటర్నల్, ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లే రెండూ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయని పేర్కొన్నారు.

లాంచ్ టైమ్‌లైన్ విషయానికొస్తే.. మునుపటి పుకార్ల ప్రకారం, లీక్‌స్టర్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత సంవత్సరం లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఫోల్డబుల్ ఐప్యాడ్ కూడా అదే సమయంలో లాంచ్ కానుంది.

ఈ లాంచ్ టైమ్‌లైన్ లీక్ గతంలో ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో, ది ఇన్ఫర్మేషన్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ షేర్ చేశారు. ఈ లీక్‌లన్నీ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేశాయి.