Post Office Scheme : భలే ఉందిగా పోస్టాఫీసు స్కీమ్.. మీరు పెట్టుబడి పెడితే చాలు.. కేవలం వడ్డీతోనే ప్రతి నెలా రూ. 10వేలు సంపాదించుకోవచ్చు..!
Post Office Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన స్కీమ్.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్లు తమ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా రూ. 10వేల వరకు వడ్డీని పొందవచ్చు. ఫుల్ డిటెయిల్స్ కోసం ఈ స్టోరీని చదవండి.

investing in Post Office Saving Scheme
Post Office Savings Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? పోస్టాఫీసులో పెట్టుబడితో ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి 55 ఏళ్లు లేదా 60 సంవత్సరాల వయస్సు తర్వాత పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత తన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. మార్కెట్లో ఏయే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు ఉన్నాయా? అని చూస్తుంటారు.
రిటైర్మ్‌మెంట్ చేసిన సీనియర్ సిటిజన్లు తమ సేవింగ్స్ పెట్టుబడి పెట్టడంతో పాటు, ప్రతి నెలా హామీతో కూడిన ఆదాయాన్ని ఇచ్చే పథకం కోసం చూస్తారు. ఇలాంటి పరిస్థితిలో సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది.
అదే.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో సీనియర్ సిటిజన్లు తమ సేవింగ్స్ డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ :
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది పోస్టాఫీసు నిర్వహించే ప్రభుత్వ పథకం. ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే రూపొందించారు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా భారీ మొత్తాన్ని సంపాదించవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం 8.2 శాతం వడ్డీ రేటు రాబడిని ఇస్తుంది.
ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిని కేవలం రూ. వెయ్యి నుంచి ప్రారంభించవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా పెట్టుబడి పెట్టగల మొత్తం రూ. 30లక్షల వరకు ఉంటుంది.
ప్రతి నెలా రూ. 10వేలు సంపాదిస్తారు :
మీరు మొత్తం రూ.15 లక్షలను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి నెలా రూ.10,250 వడ్డీ వస్తుంది. అదేవిధంగా, 5 సంవత్సరాలలో మీకు వడ్డీగా రూ. 6,15,000 లభిస్తుంది.
టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా :
పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో పెట్టుబడితో భారీగా డబ్బులను ఆర్జించవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి కోసం మీకు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలి. తద్వారా కొత్త ఖాతాను ఓపెన్ చేయొచ్చు.
ఈ స్కీమ్ కింద 7.5 శాతం వడ్డీని పొందవచ్చు. పోస్టాఫీసు టీడీలో పెట్టుబడిని కేవలం రూ.1000తో మొదలు పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడికి 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్ 7.5 శాతంగా వడ్డీని అందిస్తుంది. రూ.5లక్షల వరకు 10 ఏళ్లపాటు జమ చేస్తే.. వడ్డీ కింద రూ.5,51,175, మెచ్యూరిటీ మొత్తంగా రూ.10,51,175 జమ అవుతుంది.
7.5 శాతం వడ్డీతో రూ.4 లక్షలు జమ చేస్తే.. 10 ఏళ్లలో రూ.4,40,940, మెచ్యూరిటీగా రూ.8,40,940 వడ్డీని పొందవచ్చు. ఈ పథకం కింద 10 ఏళ్ల పాటు రూ. లక్ష పెట్టుబడి పెడితే, రూ. 1,10,235 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ ద్వారా 2,10,235 వరకు పెరుగుతుంది.