SIP Investment Plan : రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ.. SIPలో ఎలా పెట్టుబడి పెట్టాలి.. ప్రయోజనాలేంటి? గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

SIP Investment Plan : సిస్టామాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (SIP)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఏ సమయంలో ఎంతకాలం వరకు పెట్టుబడితే అధిక లాభాలు ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి..

SIP Investment Plan : రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ.. SIPలో ఎలా పెట్టుబడి పెట్టాలి.. ప్రయోజనాలేంటి? గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

how to invest in SIP Investment Plan

Updated On : February 22, 2025 / 12:21 PM IST

SIP Investment Plan : మీ డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ పెట్టుబడి ప్లాన్ ద్వారా తక్కువ రిస్క్‌తో అధిక లాభాలను పొందవచ్చు.

Read Also : Gold Hallmarking Center : గోల్డ్ హాల్‌మార్కింగ్ సెంటర్‌ ఇలా ఓపెన్ చేయండి.. ప్రతి నెలా లక్షల్లో సంపాదించండి.. ఇంటి నుంచే అప్లయ్ చేసుకోవచ్చు!

ఇలాంటి పెట్టుబడిని కోరుకునే పెట్టుబడిదారులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (SIP) ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో అద్భుతైమన రాబడిని ఆశించవచ్చు.

అంతేకాదు.. స్టాక్ మార్కెట్లోతో పోలిస్తే ఇందులో రిస్క్ చాలా తక్కువ.. మార్కెట్‌తో సంబంధం లేకుండా మీరు పెట్టిన పెట్టుబడిపై అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకీ ఈ ఎస్ఐపీ ప్లాన్ ద్వారా పెట్టుబడి ఎలా పెట్టాలి? ఎంతకాలం పెట్టాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పెట్టుబడి పెట్టే సమయంలో ఎస్ఐపీకి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి అనేది వివరంగా తెలుసుకుందాం.

ఎస్ఐపీతో కలిగే ప్రయోజనాలివే
రూపాయి ఖర్చు సగటు : SIPలో పెట్టుబడి పెట్టడం వల్ల రూపాయి ఖర్చు సగటు ప్రయోజనాన్ని పొందవచ్చు. మార్కెట్ పడిపోయినప్పుడు, మీరు తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లను పొందవచ్చు. మార్కెట్ పుంజుకున్నప్పుడు మీరు ఎక్కువ ధరకు తక్కువ యూనిట్లను పొందుతారు.

పెట్టుబడి : SIPలో మీరు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెడతారు, మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నా లేదా బేరిష్‌గా ఉన్నా. ఇది మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది.

తక్కువ రిస్క్ : SIPలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ రిస్క్ తగ్గుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా, మీరు చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. దీని కారణంగా, మార్కెట్లో హెచ్చుతగ్గులు మీ పెట్టుబడిపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.

మెరుగైన రాబడి : SIPలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి లభిస్తుంది.

SIPలో ఎలా పెట్టుబడి పెట్టాలి :
ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ హౌస్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక SIP అకౌంట్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోవాలి. ఆపై మీ పెట్టుబడి మొత్తం, సమయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు.

Read Also : PM Kisan 19th Installment : ఈ నెల 24నే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరును ఇలా చెక్ చేయండి!

SIPలో పెట్టుబడికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలివే :
మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోండి : SIPలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలను, మీరు దేనికి పెట్టుబడి పెడుతున్నారో ముందుగా తెలుసుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఎంత సమయం అవసరమో కూడా తెలుసుకోండి. మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ప్రకారం సరైన మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోండి.

పెట్టుబడి మొత్తం, సమయం :
మీరు ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే విషయాలపై ఒక ప్రణాళిక, లక్ష్యం అనేవి తప్పనిసరిగా ఉండాలి.